జపాన్ లో 332 వ రోజు కూడా హౌస్ ఫుల్స్ నమోదు చేసుకున్న #RRR

దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) తెరకెక్కించిన #RRR చిత్రం గత ఏడాది విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే.

బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని సృష్టించి 1300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, అవార్డ్స్ మరియు రివార్డ్స్ విషయం లో కూడా ఊహించని అద్భుతాలు సృష్టించింది.

కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డు #RRR చిత్రం ని వరించింది.అంతే కాకుండా ఆరు నేషనల్ అవార్డ్స్, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంది.

ఇండియన్ ఆడియన్స్ కంటే కూడా ఇతర దేశాల్లో కలెక్షన్స్ పరంగా చరిత్ర తిరగరాసింది.ముఖ్యంగా జపాన్ లో ఈ చిత్రం గత ఏడాది విడుదలై ఇంకా ఆడుతూనే ఉంది.

ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 332 రోజులైంది.ఇంకా 16 థియేటర్స్ లో నాన్ స్టాప్ గా ఆడుతూనే ఉంది.

Advertisement

ఇలాంటి హిస్టారికల్ రన్ జపాన్( Japan ) సినిమాలకు అలాగే హాలీవుడ్ సినిమాలకు కూడా రాలేదు.అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 332 వ రోజు కూడా హౌస్ ఫుల్స్ పడ్డాయి అట.వచ్చే నెల 21 వ తారీఖున ఈ చిత్రం జపాన్ లో విడుదలై సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంటుందని అంటున్నారు.సంవత్సరం రోజులు మాత్రమే కాదు, అంతకు మించి కూడా ఈ చిత్రం ఆడే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

మరి ఇంతటి ఆదరణ చూపించిన జపాన్ ప్రేక్షకులను మరోసారి కలిసి, ఒక విజయోత్సవ సభ లాగ #RRR మూవీ టీం ఏర్పాటు చేసేందుకు సిద్ధం కాబోతుందని ఇండస్ట్రీ లోని కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.అంటే మరోసారి రామ్ చరణ్ ఎన్టీఆర్( Ram Charan, NTR ) మరియు రాజమౌళి కలవబోతున్నారు అన్నమాట.

కేవలం జపాన్ లో మాత్రమే కాదు, ఈ చిత్రాన్ని రీసెంట్ గా అమెరికా లో కూడా కొన్ని లొకేషన్స్ లో రీ రిలీజ్ చేసారు.అక్కడ కూడా ఈ వీకెండ్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని రిజిస్టర్ చేసుకుంది ఈ చిత్రం.మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసినప్పుడు ఒక్కరు కూడా పట్టించుకోలేదు.

రీ రిలీజ్ లో కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.అలంటికి ఓవర్సీస్ లో ఈ సినిమా ఇన్ని రోజులు అయినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది అంటే అక్కడి ఆడియన్స్ కి ఈ చిత్రం ఏ రేంజ్ లో నచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు