సాహసం చేసిన ఐటెమ్ గర్ల్

‘మిర్చి’ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసి హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ హంసా నందిని.

ఈ అమ్మడు గత కొంత కాలంగా ఐటెం సాంగ్స్‌తో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా ఈమె ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది.మరో వైపు ఈమె పలు షాపింగ్‌ మాల్స్‌ను ఓపెన్‌ చేస్తూ బిజీ బిజీగా గడుపుతూ ఉంది.

తాజాగా ఈమె చేసిన ఒక సాహసం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.ఇటీవల ఈమె న్యూజీలాండ్‌ వెళ్లింది.

అక్కడ ఈమె పెద్ద సాహసాన్నే చేసింది.అక్కడ బంగీ జంప్‌ చేసి అందరిని ఆశ్చర్య పర్చింది.

Advertisement

టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు గతంలో బంగీ జంప్‌ చేసిన విషయం తెల్సిందే.అయితే హీరోయిన్స్‌ మాత్రం ఇప్పటి వరకు అలాంటి సాహసాలు చేసింది లేదు.

కాని హంసా నందిని మాత్రం ఆ సాహసం చేసి, తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకుంది.ఇలాంటి కష్టమైన పనులను సుకుమారి అయిన హంసాకు అవసరమా అని ఆమె అభిమానులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు