ఈ హోమ్ మేడ్ తులసి ఫేస్ క్రీమ్ ను రోజు వాడితే మొటిమలు మీ దరిదాపుల్లోకి కూడా రావు!

సాధారణంగా కొందరిని మొటిమలు( Pimples ) చాలా తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.ఎంత ప్రయత్నించినా మొటిమలు పోనే పోవు.

పైగా పాత మొటిమలు తగ్గకుండా మళ్లీ కొత్త మొటిమలు వచ్చేస్తుంటాయి.ఈ మొటిమల కారణంగా చర్మ సౌందర్యం దెబ్బతింటుంది.

ఈ క్రమంలోనే కొందరు లోలోన ఎంతగానో మదన పడుతూ ఉంటారు.ఒత్తిడికి గుర‌వుతుంటారు.

కానీ ఇకపై వ‌ర్రీ అవ్వ‌కండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్‌ మేడ్ తులసి ఫేస్ క్రీమ్ ను రోజు నైట్ రాసుకుంటే మొటిమలు పోవడమే కాదు మళ్ళీ మళ్ళీ అవి మీ దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం తులసి ఫేస్ క్రీమ్( Tulasi Face Cream ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు ఫ్రెష్ తులసి ఆకులు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green Tea Powder ) మరియు నాలుగు లవంగాలు వేసి వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.

ఆ తర్వాత స్ట‌వ్‌ ఆఫ్ చేసి మరిగించిన తులసి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.

అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు తులసి వాటర్, నాలుగు చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్( Lavender Essential Oil ), నాలుగు చుక్కలు స్వీట్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకుని ఐదారు నిమిషాల పాటు ఆగకుండా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేయాలి.తద్వారా మన తులసి ఫేస్ క్రీమ్ సిద్ధం అవుతుంది.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఆపై తయారు చేసుకున్న ఫేస్ క్రీమ్ ముఖానికి అప్లై చేసి సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే మొండి మొటిమలు పరారవుతాయి.కొత్త మొటిమలు రాకుండా ఉంటాయి.

మొటిమల తాలూకు మచ్చలు సైతం మాయం అవుతాయి.మీ స్కిన్ క్లియర్ అండ్ గ్లోయింగ్( Clear and Glowing Skin ) గా మారుతుంది.

కాబ‌ట్టి మొటిమ‌ల‌కు దూరంగా ఉండాలనుకునే వారు ఈ క్రీమ్ ను ట్రై చేయండి.

తాజా వార్తలు