తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీని ట్రై చేయండి!

జుట్టు తెల్లబడకుండా రక్షించడంలో మెలనిన్ ( Melanin ) అనేది కీలక పాత్ర పోషిస్తుంది.

జుట్టులో( Hair ) మెలనిన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమైందంటే కురులు తెల్లబడటం కూడా ప్రారంభమవుతాయి.

అయితే తెల్ల జుట్టును( White Hair ) కవర్ చేసుకునేందుకు చాలా మంది కలర్ వేసుకుంటూ ఉంటారు.మరికొందరు తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవాల‌ని భావిస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు తులసి ఆకులు,( Tulsi Leaves ) గుప్పెడు పుదీనా ఆకులు( Mint Leaves ) మరియు అర కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్,( Henna Powder ) వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకోవాలి.

Advertisement

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు సరిపడా పుదీనా తులసి జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసి అర గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లబడుతుంది.

వైట్ హెయిర్ తో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది.అలాగే ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.

హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా సైతం మారతాయి.

నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు