ఏం తిన్నా నాలుక మంట పుడుతుందా? అయితే ఇలా చేయండి!

సాధార‌ణంగా ఒక్కోసారి ఏం తిన్నా నాలుక తీవ్రంగా మంట పుడుతూ ఉంటుంది.

వేడి వేడి ఆహారాలు తీసుకున్న‌ప్పుడు కాల‌డం, పుండ్లు ఏర్ప‌డం, పొర‌పాటు కొరుక్కోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల‌ నాలుక త‌ర‌చూ మంట మ‌రియు నొప్పి పుడుతుంటుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.మందులు కూడా వాడ‌తారు.

అయితే నాలుక మంట ప‌డుతున్న‌ప్పుడు వెంటనే ఉపశమనం పొందడానికి మందులు, మాత్రల కోసం చూడకుండా ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.మ‌రి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

నాలుక మంట‌ను త‌గ్గించ‌డంలో తేనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఒకటి లేదా రెండు స్పూన్ల తేనెను నోట్లో వేసుకుని కాసేపు అలానే ఉంచి.

Advertisement

ఆ త‌ర్వాత కొద్ది కొద్దిగా మింగుతుండాలి.ఇలా చేస్తే మంట త‌గ్గుతుంది.

పైగా తేనెలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ల‌క్ష‌ణాలు బ్యాక్టీరియాను నాశ‌నం చేసి నాలుకపై ఏర్ప‌డిన పుండ్ల‌ను త‌గ్గిస్తాయి.అలాగే నాలుక తీవ్రంగా మంట వ‌స్తుంటే.

వెంట‌నే ఒక ఐస్ క్యూబ్ ను తీసుకుని నాలుక పెట్టి చప్పరించాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల మంటే కాదు నొప్పి నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

నాలుక మీద పుండ్లు, కురుపులు ఉన్నా త‌ర‌చూ మంట వ‌స్తుంది.అలాంట‌ప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు స్పూన్ల క‌ల‌బంద జెల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాట‌ర్‌ను నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయాలి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

ఇలా చేస్తే నాలుక మంట నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.మ‌రియు క‌ల‌బందలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుండ్ల‌ను, కురుపుల‌ను క్ర‌మంగా త‌గ్గించేస్తాయి.

Advertisement

ఇక ఒక గ్లాస్ వాట‌ర్‌లో మెంతి పొడి వేసి బాగా మ‌రిగించి ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాట‌ర్ గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత నోట్లో పోసుకుని బాగా పుక్క‌లించాలి.ఇలా ఉద‌యం, సాయంత్రం చేస్తే త‌ర‌చూ నాలుక మంట పుట్టుకుండా ఉంటుంది.

తాజా వార్తలు