తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కావాలా..ఇలా చేస్తే స‌రి?

సాధార‌ణంగా కొంద‌రు ఎంత త‌క్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకున్నా త్వ‌ర‌గా జీర్ణంగాక ఇబ్బంది ప‌డ‌తాడు.

ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాక‌పోవ‌డం వ‌ల్ల క‌‌డుపు ఉబ్బ‌రం, పొత్తికడుపు నొప్పి, విపరీత‌మైన‌ త్రేన్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు అసౌక‌ర్యంగా కూడా ఉంటుంది.

దీంతో ఏమైనా ఆహారం తినాలంటేనే భ‌య‌ప‌డిపోతుంటారు.అయితే జీర్ణ వ్య‌వస్థ ప‌ని తీరు మంద‌గించ‌డం వ‌ల్ల ఈ అజీర్తి స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

చాలా మంది ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు ట్యాబ్ల‌ట్లు, టానిక్కులు వాడుతుంటారు.కానీ, కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే తిన్న ఆహారాన్ని సుల‌భంగా మ‌రియు త్వ‌ర‌గా జీర్ణం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఆహారాన్ని త‌ర్వ‌గా జీర్ణం అయ్యేలా చేయ‌డంలో బేకింగ్ సోడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

భోజ‌నం చేసిన త‌ర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి తీసుకుంటే చాలా త్వ‌ర‌గా ఆహ‌రం జీర్ణం అవుతుంది.

అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌కు కూడా ఆహారాన్ని త్వ‌ర‌గా జీర్ణం చేసే శ‌క్తి ఉంది.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ మ‌రియు కొద్దిగా తేనె క‌లిపి తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.దాంతో తీసుకున్న ఫుడ్ ఫాస్ట్‌గా డైజెస్ట్ అవుతుంది.

సాధార‌ణంగా కొంద‌రు ఆరోగ్యానికి మంచిద‌ని వంట‌ల‌కు కొబ్బ‌రి నూనెను వాడుతుంటారు.అయితే ఆరోగ్యానికే కాదు తిన్న ఆహారాన్ని సూప‌ర్ ఫాస్ట్‌గా జీర్ణం అయ్యేలా చేయ‌డంలోనూ కొబ్బ‌రి నూనె ఉప‌యోగ‌ప‌డుతుంది.భోజ‌నం త‌ర్వాత ఒక స్పూన్ కొబ్బ‌రి నూనెను డైరెక్ట‌ర్‌గా తీసుకుంటే అజీర్తి స‌మ‌స్యే ఉండ‌దు.

ఇక ఈ టీప్స్‌తో పాటు వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోండి.నీటిని అధికంగా తాగడం వల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగుప‌డుతుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

దాంతో జీర్ణ స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు