జుట్టంతా చెడు వాసన వ‌స్తుందా.. అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, సిల్కీగా, అందంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోసం మార్కెట్‌లో ల‌భించే షాంపూలు, హోయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.

అయితే ఒక్కోసారి జుట్టంతా చెడు వాస‌న వ‌స్తుంది.త‌ల‌స్నానం చేసిన వారిలోనూ ఈ స‌మ‌స్య ఉంటుంది.

చెమ‌ట‌, చండ్రు, పుల్యూష‌న్, రాషెస్, బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టంతా వాస‌న వ‌స్తుంది.అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ ఎఫెక్ట్‌వ్ టిప్స్ ఫాలో అయితే.

మీ కురుల నుంచి మంచి సువాస‌న వ‌స్తుంది.కొబ్బ‌రి పాలు జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు.

Advertisement

కొబ్బ‌రి పాల‌లో ఉండే ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, మ‌రియు ఇత‌ర పోష‌కాలు.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

డ్యామేజ్ అయిన జుట్టు, చుండ్రును నివారిస్తుంది.అలాగే కేశాల నుంచి వ‌చ్చే చెడు వాస‌న‌ను కూడా పోగుడుతుంది.

అందువ‌ల్ల‌, ఒక బ‌ల్‌లో కొబ్బ‌రి పాలు మ‌రియు లావెండర్ ఆయిల్ స‌మానంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టించి.

అర‌గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇలా చేయ‌డం శిరోజాల దుర్వాస‌న సులువుగా పోతుంది.

Advertisement

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా.జాస్మిన్ ఆయిల్‌, ఇంట్లో త‌యారు చేసుకున్న రోజ్ వాట‌ర్‌, వెనీలా ఎక్ట్సాక్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ఒక స్ప్రే బాటిల్ తీసుకొని.

అందులో నింపుకోవాలి.ఈ హెయిర్ స్ప్రేను తలస్నానం చేసిన తరువాత లేదా తలంటు చేయకున్నా కేశాల‌పై స్ప్రే చేసుకోవచ్చు.

అలా చేస్తే.జుట్టు చెడు వాస‌న రాకుండా ఉంటుంది.

ఇక నీటిలో ఇంట్లో త‌యారు చేసుకున్న రోజ్‌వాట‌ర్ క‌లిపి త‌ల ‌స్నానం చేసినా లేదా త‌ల స్నానం చేసిన త‌ర్వాత రోజ్ వాట‌ర్‌ను హెయిర్‌కు స్ప్రే చేసినా చెడు వాస‌న రాకుండా ఉంటుంది.ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు సిల్కీగా మ‌రియు కాంతివంతంగా కూడా మారుతుంది.

తాజా వార్తలు