ఇదేందయ్యా ఇది.. స్కూటీ కోసం ఏకంగా రూ.కోటి పెట్టి ఫాన్సీ నంబర్..!

కొంతమంది సౌకర్యవంతమైన, బాగా మైలేజ్ అందించే వాహనం కొనడానికి చాలా డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు, మరికొందరు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌లకు ఆకర్షితులవుతారు.తమ వాహనానికి ఫలానా నంబర్ కోసం లక్షలు లేదా కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు.

అయితే హిమాచల్ ప్రదేశ్‌లో నివసించే ఒక వ్యక్తి ఇటీవల తన స్కూటీకి ఫ్యాన్సీ నంబర్‌ని పొందడానికి ఏకంగా 1.12 కోట్ల రూపాయలను బిడ్ చేశాడు.

కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ఆన్‌లైన్ వేలం కోసం స్పెషల్ టు-వీలర్ వాహనాల నంబర్‌లను ఉంచింది.వీటి మొదట ధరను రూ.1,000గా ట్యాగ్ చేసింది.అయితే, HP99-9999 నంబర్ కోసం బిడ్ అమౌంట్ రూ.1.12 కోట్లకు చేరుకుంది.ఇది హిమాచల్ ప్రదేశ్ చరిత్రలో ద్విచక్ర వాహన నంబర్‌కు అత్యధిక ధరగా నిలిచింది.

ఇంతకు ముందు ఫ్యాన్సీ స్కూటర్ లైసెన్స్ ప్లేట్‌లకు ఇంత ఆదరణ ఎప్పుడూ కనిపించలేదు.ఇప్పుడేమో ఈ నంబర్ కోసం 26 మంది బిడ్డర్ల నుంచి చాలా అధిక రేట్ల బిడ్లు వచ్చాయి.

ముఖ్యంగా, రెండవ, మూడవ VIP నంబర్లు, HP99-0009, HP-990005 కూడా వరుసగా రూ.21 లక్షలు, 20 లక్షల అధిక బిడ్‌లను పొందాయి.ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసేందుకు స్కూటర్ యజమానులు వేలంలో పాల్గొనడం హిమాచల్ ప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి.

Advertisement

ఈ వేలం ప్రక్రియ తక్షణమే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది, వ్యక్తులు వేలం ప్రక్రియ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేయడం, అధిక బిడ్‌ల గురించి మీమ్‌లు చేయడం మొదలుపెట్టారు.కొంతమంది వినియోగదారులు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, మరికొందరు బిడ్డర్ నంబర్‌ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకుంటే జరిమానా విధించాలని సూచించారు.

రియల్ హీరోకి 100 అడుగుల అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని..
Advertisement

తాజా వార్తలు