యుఎస్ లో డైనో సలార్ దెబ్బ మాములుగా లేదుగా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్( Salaar ).

ఈ సినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా అది డిసెంబర్ కు వాయిదా వేశారు.

మరి వాయిదాతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.ఎట్టకేలకు రిలీజ్ డేట్ అయితే దగ్గర పడింది.

రేపే ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.దీంతో గత వారం రోజులుగా ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచేసి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రతీ చోట చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు.

Advertisement

కాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్( Advance Bookings ) ఇప్పటికే స్టార్ట్ అయ్యిన విషయం తెలిసిందే.యుఎస్ ప్రీమియర్ లలో( US Premiere ) సలార్ హవా మాములుగా లేదు.యుఎస్ లో ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) నెక్స్ట్ లెవల్లో హంగామా చేస్తున్నారు.

దీంతో ఈ మూవీ జస్ట్ అడ్వాన్స్ సేల్స్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2 మిలియన్ మార్క్ చేరువకు వచ్చేసింది.ఇప్పటి వరకు 1.81 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసి 2 మిలియన్ డాలర్స్ దిశగా దూసుకు పోతుంది.దీంతో భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టడం ఖాయం అనే చెప్పాలి.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో.

Advertisement

తాజా వార్తలు