టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.యువగళం – నవశకం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభ అంతకంటే అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు.
యువగళం పాదయాత్రను లోకేశ్ ఎవరి కోసం చేశారని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తన పార్టీ క్యాడర్ ను మోసం చేస్తున్నారని తెలిపారు.
ప్యాకేజీ మాట్లాడుకొనే యువగళం సభకు పవన్ హాజరయ్యారన్నారు.పవన్ ప్యాకేజీ రాజకీయాలు తెలియనిదా అన్న ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే పోటీ చేస్తారని తాము ఎప్పుడో చెప్పామన్నారు.
ఈ క్రమంలోనే మీరు ఎంతమంది ఏకమైనా జగన్ ను ఏం చేయలేరని తెలిపారు.తాడేపల్లి ఇల్లు తలుపులను బద్ధలు కొట్టే శక్తి మీకెక్కడిదని ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేశ్, పవన్ కు ఏపీలో ఇళ్లే లేవన్న మంత్రి అంబటి గతంలో హామీలిచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు.







