ఏపీలో ప్రైవేట్ హాస్పిటల్స్ అధిక ఫీజుల దోపిడీ కి హైకోర్టు బ్రేకులు..!!

కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలు చికిత్స విషయంలో భారీగా దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే.

రోగుల వద్ద అధిక మోతాదులో ప్రభుత్వం నియమించిన ధరల కంటే భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నట్లు అనేక మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

ఇలాంటి తరుణంలో హైకోర్టు రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ అధిక ఫీజులు అరికట్టడానికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.మేటర్ లోకి వెళ్తే రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

నోడల్ అధికారి సంతకం లేకుండా రోగులు బిల్లులు చెల్లించకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో నోడల్ అధికారిని ప్రభుత్వం నియమించడం జరిగింది.

అదే రీతిలో ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ప్రభుత్వం కరోనా విషయంలో నియమించిన ధరల బోర్డును ఏర్పాటు చేయాలని సూచించింది.ఈ క్రమంలో ఆదేశాలు అమలయ్యేలా జిల్లా కలెక్టర్, డి ఎం హెచ్ వో లకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Advertisement
పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

తాజా వార్తలు