లెవన్త్ అవర్ వెబ్ సిరీస్ కు తమన్నా రెమ్యునరేషన్ ఎంతంటే..?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరోయిన్ తమన్నా లెవన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటించగా ఈ నెల 9వ తేదీన ప్రముఖ ఓటీటీ యాప్ లలో ఒకటైన ఆహాలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కోసం తమన్నా రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.లెవన్త్ అవర్ వెబ్ సిరీస్ కోసం తమన్నా ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గతంలో కాజల్ నటించిన వెబ్ సిరీస్ నెగిటివ్ టాక్ తెచ్చుకోగా తమన్నా వెబ్ సిరీస్ తో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.ఒకవైపు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న తమన్నా మరోవైపు సినిమా ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం.

మొదట ప్రకటించిన డేట్ ప్రకారం సీటీమార్ రేపు విడుదల కావాల్సి ఉంది.

Advertisement

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది.ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాతో పాటు అంధాధూన్ రీమేక్ గా తెరకెక్కుతున్న మాస్ట్రో సినిమాలో, గుర్తుందా శీతాకాలం సినిమాలో తమన్నా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన లెవన్త్ అవర్ టీజర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఈ వెబ్ సిరీస్ ను యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశారు.ఈ సినిమాలో తమన్నా అరత్రికా రెడ్డి పాత్రలో నటిస్తున్నారు.ఆహా డిజిటల్ రంగంలో సత్తా చాటేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు