వేదికపై నటుడు చెంప చెల్లుమనిపించిన విశాల్.. ఏం జరిగిందంటే?

సాధారణంగా ఒక సినిమా చిత్రీకరణ జరుపుకొని అనంతరం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

అయితే ఈ మధ్యకాలంలో హీరోలు కాస్త భిన్నంగా సినిమాలను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు.

ఈ మధ్యకాలంలో ఫ్రాంక్ వీడియోలతో సినిమాలను ప్రమోట్ చేయడంతో పెద్ద ఎత్తున సినిమా జనాలలోకి వెళ్లడమే కాకుండా కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణం అవుతుంది.ఇకపోతే తాజాగా ఇలాంటి ఫ్రాంక్ వీడియోతో ఒక్కసారిగా అందరిని హీరో విశాల్ ఆశ్చర్యానికి గురి చేశారు.

Hero Vishal Slapped Robo Vinod On Stage Know Details Inside , Hero Vishal, Robo

హీరో విశాల్ తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.తాజాగా ఈయన వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరికెక్కిన లాఠీ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement
Hero Vishal Slapped Robo Vinod On Stage Know Details Inside , Hero Vishal, Robo

ఈ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

Hero Vishal Slapped Robo Vinod On Stage Know Details Inside , Hero Vishal, Robo

వేదికపై హీరో విశాల్ తో పాటు నటుడు రోబో శంకర్ వేదికపై విశాల్ తో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా అతని చెంప చెల్లుమనిపించారు.ఈ విధంగా విశాల్ తనపై చేయి చేసుకోవడంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే వేదికపై ఉన్న మరో వ్యక్తి నవ్వుకుంటూ కిందికి వెళ్లడంతో ఇది ఫ్రాంక్ అని తెలిసి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలతో పెద్ద ఎత్తున సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు