కోబ్రాలో పాత్రపై హీరో విక్రమ్ కామెంట్స్.. నెట్టింట్లో వైరల్!

చియాన్ విక్రమ్, కేజిఎఫ్ నటి శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కోబ్రా.

ఈ సినిమా ఆగస్టు 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో హైదరాబాద్ లోనే పార్క్ హయత్ హోటల్లో ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ లో భాగంగా నటుడు విక్రమ్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ కి నా పాత్రతో చాలా మంచి అనుబంధం ఉంది.ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైందని నా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయిందంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఈ సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్లోనే చూడండి అంటూ తెలియ చేశారు.

Advertisement

ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే ఇది ఇంగ్లీష్ సినిమాల ఉంటుంది కానీ సినిమా మొత్తం ఒక ఎమోషనల్ డ్రామా, ఈ సినిమా ఒక యూనివర్సల్ సినిమా ఇందులో అన్ని అంశాలు ఉంటాయి అంటూ ఈ సందర్భంగా విక్రమ్ కోబ్రా సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇకపోతే ఈ సినిమాలో నటించిన శ్రీనిధి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని మూడేళ్ల కష్టమే ఈ సినిమా ఫలితం అంటూ ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు.భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
Advertisement

తాజా వార్తలు