సూర్య ఈటి కోసం సొంత ప్రయత్నం..!

సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిథి మారన్ నిర్మించిన సినిమా ఈటీ.పాండిరాజ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటించారు.

సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది.కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసిన సూర్య లేటెస్ట్ గా ఈటీ అంటూ మాస్ సినిమాతో వస్తున్నారు.

మార్చ్ 10న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించింది.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో సూర్య మాస్ లుక్ తో అదరగొడుతున్నారు.

తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం సూర్య తానే స్వయంగా తన పాత్రకి తెలుగు డబ్బింగ్ చెబుతున్నారు.

Advertisement

కొన్నాళ్లుగా తెలుగులో కూడా తన స్టార్ డం కొనసాగిస్తున్న సూర్య ఈటీ కోసం సొంతంగా తెలుగు డబ్బింగ్ చెబుతున్నారు.ఈ సినిమాకు ఇమ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సూర్య ఈటీ తెలుగు టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. జై భీమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూర్య రెండేళ్ల తర్వాత తన సినిమా థియేటర్ లో రిలీజ్ చేస్తుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు