Hero Sudeep Sarangi: కుటుంబ పోషణ కోసం డ్రైవర్ గా మారిన హీరో.. ఎవరో తెలుసా?

సోషల్ మీడియా వారు పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానులకు ఉన్న వ్యత్యాసం చాలావరకు తగ్గిపోయింది.

దీంతో అభిమానులు వారి అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు.

మామూలుగా నిత్యం సోషల్ మీడియాలో ఎవరో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.అందులో కొన్ని వార్తల నిజమైతే మరికొన్ని రూమర్స్ ని వైరల్ చేస్తూ ఉంటారు.

కానీ చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో వచ్చే వార్తల నిజమని సెలబ్రిటీలను తప్పుగా అపార్ధం చేసుకుంటూ ఉంటారు.

సెలబ్రిటీలలో విషయంలో వచ్చే వార్తలతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.అటువంటి ఘటనే ఒకటి ఒక నటుడు విషయంలో జరిగింది.అసలేం జరిగిందంటే.సుదీప్ సారంగి( Hero Sudeep Sarangi ) తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ బెంగాలీ హిందీ తమిళం సినిమాలలో, తెలివిజన్ షోలు ఫాలో అయ్యే వారికి సుదీప్ సారంగీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.2003లో కాదల్ కొండేన్( Kaadhal Konden Movie ) సినిమాలో సుదీప్ సారంగి హీరోగా నటించాడు.ఇందులో సోనియా అగర్వాల్( Sonia Agarwal ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Advertisement

ధనుష్ సైకో కిల్లర్ గా నటించాడు.ఈ ముగ్గురికి ఈ సినిమా మొదటి సినిమానే.

కానీ అగర్వాల్, ధనుష్‌కు మంచి ఆఫర్లు రావడంతో వారు నిలదొక్కుకున్నారు.కాకపోతే ఈ మూవీ సుదీప్ కు పెద్దగా పేరు తీసుకురాలేదు.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఆయనకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

సుదీప్ సారంగి డ్రైవర్‌గా మారి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. హీరో సుదీప్ ఈ ఖాకీ బట్టలతో ఉన్న ఫొటోను చూసి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని అందరు అనుకుంటున్నారు.

దీనికి చెక్ పెట్టేందుకు నటుడు సుదీప్ క్లారిటీ ఇచ్చాడు.తను ఒక బ్యాంకు ప్రకటన కోసం ఆ వేషం వేయాల్సి వచ్చిందని అసలు విషయం చెప్పుకొచ్చారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

తనకు ఇంకా అలాంటి పరిస్థితి రాలేదని తను కొన్ని ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలిపారు.సుదీప్ సారంగి.

Advertisement

తాజా వార్తలు