బోయపాటి దర్శకత్వంలో రామ్ నెక్స్ట్ సినిమా

ఎనర్జిటిక్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతుంది.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ పక్కా మాసివ్ రోల్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు.ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.

Hero Ram Next Movie With Boyapati Srinu, Tollywood, Linguswamy, Balakrishna, Sou

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చేయబోయే నెక్స్ట్ సినిమా గురించి కూడా ఇప్పుడు టాలీవుడ్ ఓ హాట్ టాపిక్ నడుస్తుంది.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందనే మాట గట్టిగా వినిపిస్తుంది.ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణతో మాస్ మసాలా మూవీ తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.ఇందులో బాలయ్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.

ఇప్పటికే బాలకృష్ణకి సంబందించిన కొన్ని లుక్స్ చిత్ర యూనిట్ రివీల్ చేసింది.ఈ నేపధ్యంలో బాలయ్య ఇందులో రైతు, అఘోరా, ఓ స్టైలిష్ పాత్రలలో దర్శనం ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.దీని తర్వాత బోయపాటి రామ్ తో సినిమా చేయడానికి రెడీగా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసాడని తెలుస్తుంది.

రీసెంట్ గా బోయపాటి రామ్ ని కలిసి కథ నేరేట్ చేయడం జరిగిందని టాక్.ఇక రామ్ కూడా తన కెరియర్ లో ఇస్మార్ట్ శంకర్ కంటే ముందు పక్కా మాస్ మసాలా మూవీ ఒకటి కూడా చేయలేదు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

కండలు తిరిగిన దేహంతో పవర్ ఫుల్ విలన్స్ ని ఎదుర్కొనే హీరోలా కనిపించలేదు.బోయపాటి శ్రీను సినిమాతో ఆ లోటు తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఈ నేపధ్యంలోనే అతని స్టొరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని బోగట్టా.

తాజా వార్తలు