దుబాయ్ లో కూడా నన్ను గుర్తుపట్టారు.. దానికి కారణం ఆ దర్శకుడే: నాని!

యాక్టింగ్ అంటే ఇంట్ర‌స్ట్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రూ సినిమాల్లో , సీరియ‌ల్స్ లో న‌టించాల‌ని అనుకుంటారు.కానీ అంత ఈజీ కాదు.

బ్యాక్ స‌పోర్ట్ ఉండాలి.లేదంటే ఇండస్ట్రీలో మ‌న‌కంటూ ఓ గుర్తింపు ఉండాలి.

ఆ గుర్తింపు రావాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి.అలా ఆర్జేగా, క్లాప్ డైర‌క్ట‌ర్ గా ప‌నిచేసి సోలోగా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అతికొద్ది టాలీవుడ్ హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని ఒక‌రు.

డిగ్రీ చ‌దువుకునే రోజుల్లో నానికి మ‌ణిర‌త్నం అన్నా ఆయ‌న సినిమాల‌న్నా చాలా ఇష్టం.ఆ ఇష్టంతోనే టాలీవుడ్ లో డైర‌క్ట‌ర్ గా ఎంట్రీ ఇవ్వాల‌ని అనుకున్నాడు.

Advertisement

అప్ప‌టికే త‌న బంధువు ప్రొడ్యూస‌ర్ అనీల్ కుమార్ 2005లో బాపు డైర‌క్ష‌న్ లో రాధా గోపాళం అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.దీంతో అనీల్ కుమార్ సాయంతో నాని రాధా గోపాళం సినిమాలో బాపుకు క్లాప్ డైర‌క్ట‌ర్ గా ప‌నిచేశాడు.

అ త‌రువాత అల్ల‌రి బుల్లోడు, ఢీ, అస్త్రం సినిమాల‌కు క్లాప్ డైర‌క్టర్ గా కంటిన్యూ అయ్యాడు.కానీ తాను అనుకుంది డైర‌క్ట‌ర్ అవ్వాల‌ని.

ఇలా క్లాప్ డైర‌క్టర్ గా లైఫ్ లీడ్ చేస్తే అనుకున్న‌ గోల్ రీచ్ కాలేమ‌నుకున్న నాని కొంతకాలం సినిమాలు ప‌క్క‌న పెట్టి స్క్రిప్ట్ రాసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు.

అదే స‌మ‌యంలో నాని స్నేహితురాలు రేడియా జాకీ బార్గ‌వి మ‌ల్లెల రిఫరెన్స్ తో.రేడీయో జాకీగా అవ‌కాశం వ‌చ్చింది.నాన్ స్టాప్ నాని పేరుతో వ‌న్ ఇయ‌ర్ పాటు రేడియో జాకీ ప్రోగ్రాం చేశాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అయితే 2008లో డైర‌క్ట‌ర్ మోహ‌న్ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంలో అష్టా చ‌మ్మా సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండ‌గా.ఆ సినిమాలో హీరో కోసం ఆడిషన్స్ తీసుకుంటున్న ఇంద్ర‌గంటికి ఓ యాడ్ లో నాని ఫోటో కంట‌ప‌డింది.

Advertisement

అంతే అలా నానిని సినిమా హీరోగా తొలి సినిమా అష్టాచ‌మ్మ‌తో అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు.ఆ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.డైర‌క్ష‌న్ వ‌దిలేసి హీరోగా కంటిన్యూ అయ్యాడు.

ఆ త‌రువాత రైడ్, స్నేహితుడా, భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు, అలా మొద‌లైంది, పిల్ల‌జ‌మిందార్ తో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.‌కానీ 2012లో రాజ‌మౌళి డైర‌క్ష‌న్ లో తెర‌కెక్కిన పిరియాడిక‌ల్ మూవీ ఈగ సినిమాలో ఈగ పాత్ర‌లో నాని కేవ‌లం అర‌గంట యాక్ట్ చేశాడు.

ఆ అర‌గంట నాని జీవితాన్ని కంప్లీట్ గా ఛేంజ్ చేసింది.అప్ప‌టి వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైన నాని హ‌వా ఈగ సినిమాలో 30 నిమిషాల పాత్రతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈగ క్యార‌క్ట‌ర్ వ‌ల్ల తాను ఎక్క‌డికి వెళ్లినా గుర్తుప‌డుతున్నార‌ని, రాజ‌మౌళి వ‌ల్లే తాను ఈ స్థాయిలో ఉన్న‌ట్లు నాని గుర్తు చేసుకున్నాడు.

తాజా వార్తలు