చిరంజీవి( Chiranjeevi ) చిన్న కూతురు శ్రీజను( Sreeja ) పెళ్లి చేసుకోవడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో కళ్యాణ్ దేవ్ ఒకరు.కళ్యాణ్ దేవ్ పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు ఎప్పుడు విడుదలయ్యయో కూడా చాలామందికి తెలియదు.
శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా కళ్యాణ్ దేవ్ పోస్ట్ లు చూస్తే మాత్రం విడాకులు తీసుకున్నారని అర్థమవుతోంది.

అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ ( Kalyan Dev )కూతురిని మిస్ అవుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.తన తల్లి జ్యోతి కృష్ణన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కళ్యాణ్ దేవ్ మిస్ యూ మై బేబీ నవిష్క అని పేర్కొన్నారు.ప్రతి ఆదివారం కేవలం నాలుగు గంటలు మాత్రమే కళ్యాణ్ దేవ్ కు నవిష్కను కలిసే వీలు ఉందని సమాచారం అందుతోంది.
శ్రీజతో దూరం పెరగడం, సరైన మార్కెట్ లేకపోవడం వల్ల కళ్యాణ్ దేవ్ తో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.శ్రీజ కళ్యాణ్ దేవ్ మధ్య చిన్నచిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శ్రీజ కళ్యాణ్ దేవ్ జోడీ చూడముచ్చటగా ఉంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం

కళ్యాణ్ దేవ్ అయినా రాబోయే రోజుల్లో శ్రీజతో ఏర్పడిన గ్యాప్ గురించి స్పందించి స్పష్టత ఇస్తారేమో చూడాలి.కళ్యాణ్ దేవ్ పై వ్యక్తిగతంగా మాత్రం ప్రేక్షకుల్లో నెగిటివిటీ లేదు.రాబోయే రోజుల్లో కళ్యాణ్ దేవ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.కళ్యాణ్ దేవ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.కళ్యాణ్ దేవ్ కు మంచి జరగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







