పానీ పూరి ( Pani Puri )ఇండియాలో బాగా పాపులర్ అయిన ఒక టేస్టీ స్నాక్.ఇండియన్స్ దీనిని ఒక్కసారైనా తమ లైఫ్ టైమ్‌లో రుచి చూసే ఉంటారు.
ఇది పూరీ అని పిలిచే చిన్న, గుండ్రని, క్రిస్పీ బ్రెడ్.పూరీని పానీ అని పిలిచే ఫ్లేవర్డ్ వాటర్, డ్రై ఫిల్లింగ్ మిశ్రమంతో నింపుతారు.
ఇండియాలోని వివిధ ప్రాంతాలలో, పానీ పూరీని వివిధ పేర్లతో పిలుస్తారు.వీటిని రకరకాల పద్ధతుల్లో కూడా తయారుచేస్తారు.
మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌లలో, దీనిని పానీ పూరీ అని పిలుస్తారు.వీటిని ఉడకబెట్టిన చిక్‌పీస్, తెల్ల బఠానీలు, మొలకలు, కారంగా ఉండే నీటిలో నింపుతారు.

ఢిల్లీ, పంజాబ్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో, దీనిని గోల్ గప్పాస్ ( Goal gapps )అని పిలుస్తారు.వీటిని జల్జీరా-రుచిగల నీటిలో బంగాళదుంపలు, చిక్‌పీస్‌తో నింపుతారు.పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్ ప్రాంతాలలో, దీనిని పుచ్కాస్ లేదా ఫుచ్కాస్ అని పిలుస్తారు.ఇందులో చింతపండు గుజ్జును ప్రధాన పదార్ధంగా వాడతారు.పానీ పూరీ అనేక రకాలైన రుచుల కారణంగా చాలా మందికి ఫేవరెట్ గా మారిపోయింది.అయితే 2015, జులై 12నల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్ 51 విభిన్న పానీ పూరీలను తయారు చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది.

కాగా 2023, జులై 12న అంటే ఎనిమిదేళ్ల తర్వాత సెర్చ్ ఇంజన్ గూగుల్ ( search engine is Google )ఆ రెస్టారెంట్ విజయాన్ని, భారత ప్రజలు పానీ పూరీతో కలిగి ఉన్న అనుబంధాన్ని సెలెబ్రేట్ చేసుకుంది.గూగుల్ తన వెబ్‌సైట్‌లో డూడుల్( Doodle ) అనే ప్రత్యేకమైన, రంగురంగుల పానీ పూరీ చిత్రాన్ని రూపొందించడం ద్వారా దీనిని సెలబ్రేట్ చేసుకుంది.ఈ డూడుల్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చు.ప్రజలు పానీ పూరీని ఎంతగా ఇష్టపడుతున్నారో చూపించడానికి, రెస్టారెంట్ అచీవ్‌మెంట్ గౌరవించడానికి దీనిని గూగుల్ రూపొందించింది.సెర్చ్ ఇంజన్ గూగుల్ తన వెబ్‌సైట్‌లో ఈ ప్రత్యేకమైన పానీ పూరీ డూడుల్‌ను జులై 12న ప్రదర్శించింది.







