యమునా నదీ మహోగ్రరూపం దాల్చడంతో ఢిల్లీ అల్లకల్లోలంగా మారింది.ఓ వైపు భారీ వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతోన్న ఢిల్లీ వాసులకు తాగునీటి సమస్య కూడా మొదలైంది.
వరదలు ముంచెత్తడంతో మూడు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు మూతపడ్డాయి.దీంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో వజీరాబాద్ వాటర్ ప్లాంట్ ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు.మరోవైపు ఇవాళ సాయంత్రానికి యమునా నది వరద మరింత తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది.







