న్యాచురల్ స్టార్ నాని( Nani ) సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఖచ్చితంగా కొత్తదాన్నని ఆశిస్తారు.ఎందుకంటే ఈయన ముందు నుండి డిఫరెంట్ గా ఫ్యామిలీ మొత్తం చూసే మంచి మంచి సినిమాలతో అలరించాడు.
తన నటనతో న్యాచురల్ స్టార్ అనిపించు కున్నాడు.అయితే ఈ మధ్య ఈయన కెరీర్ గాడితప్పింది.
వరుసగా ప్లాప్స్ పడడంతో కొద్దిగా ఫేమ్ కోల్పోయాడు.

ఈ సమయంలోనే వరుస ప్లాప్స్ తో సతమతం అవుతున్న నానికి దసరా వంటి బ్లాక్ బస్టర్ పడింది.శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.ఇక నాని ఈ సినిమా తరవాత కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు నాని.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని ఈసారి కూడా నాని తన నటనతో మెస్మరైజ్ చేయడం ఖాయం అని అందుకున్నారు.అది నిజమే అని తాజాగా రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తుంది.
ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్( Director Shauryan ) తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.

ఈ రోజు ఈ సినిమా నుండి టైటిల్ అండ్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్.బ్యూటిఫుల్ పోస్టర్ తో టైటిల్ ను అనౌన్స్ చేయగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.ఈ సినిమా ‘హాయ్ నాన్న’ ( hi Nanna )అనే క్యాచీ టైటిల్ ను అనౌన్స్ చేసారు.
అలాగే గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా ఇది ఎమోషనల్ రైడ్ గా సాగిపోయే బ్యూటిఫుల్ స్టోరీ అని తెలుస్తుంది.ఇక నాని 30వ సినిమా విషయానికి వస్తే ఇందులో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కీ రోల్ పోషించనుండగా.
వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తుండగా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.







