డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టులో విచారణ

డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో విచారణకు జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేశ్ కుమార్ హాజరయ్యారు.

 Demolition Of Deccan Kitchen Hotel In High Court-TeluguStop.com

లోకేశ్ కుమార్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు అభిప్రాయ పడింది.దీంతో జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేశ్ కుమార్ హైకోర్టుకు క్షమాపణ చెప్పారు.

అనంతరం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎందుకు పాటించలేదని కోర్టు ప్రశ్నించింది.ఆదివారం నాడు హోటల్ ను ఎందుకు కూల్చాల్సి వచ్చిందో చెప్పాలని పేర్కొంది.

దీనిపై లోకేశ్ కుమార్ కోర్టు ఆర్డర్ తెలియదని సమాధానం ఇచ్చారు.అయితే కోర్టు ఆర్డర్ తెలియదంటే నమ్మాలా అని ప్రశ్నించిన హైకోర్టు కూల్చివేత సమయంలో తీసిన వీడియో, ఫోటోలను సమర్పించాలని పిటిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జీహెచ్ఎంసీ కౌంటర్ పిటిషన్ కు రిప్లై కౌంటర్ వేయాలని తెలిపింది.అదేవిధంగా తదుపరి విచారణకు డిప్యూటీ సిటీ ప్లానర్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube