అభిమాని బ్యాగ్ మోసిన స్టార్ హీరో అజిత్.. అందుకే ఆయన సూపర్ స్టార్ అంటూ?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు( Hero Ajith ) తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు భారీ స్థాయిలో గుర్తింపు ఉంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరోలలో అజిత్ ఒకరు.

ఈ స్టార్ హీరో వివాదాలకు సైతం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.తాజాగా ఈ స్టార్ హీరో అభిమాని బ్యాగ్ మోయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

సాధారణంగా సినీ స్టార్స్ ఎవరైనా కనిపిస్తే ఫోటో దిగడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు.తాజాగా ఒక మహిళా అభిమాని( Ajith Fan ) సర్ సెల్ఫీ ప్లీజ్ అని అజిత్ ను రిక్వెస్ట్ చేయగా అజిత్ ఆ అభిమానితో కలిసి ఫోటో దిగడంతో పాటు ఆమె బ్యాగును కూడా మోశారు.

ఈ విషయం తెలిసిన నెటిజన్లు అజిత్ రీల్ హీరోనే కాదని రియల్ హీరో కూడా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ అభిమాని భర్త సోషల్ మీడియాలో అజిత్ గొప్పదనం గురించి షేర్ చేయగా ఆ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Hero Ajith Carrying His Fan Bag Goes Viral In Social Media Details, Ajith , Hero
Advertisement
Hero Ajith Carrying His Fan Bag Goes Viral In Social Media Details, Ajith , Hero

కార్తీక్ ( Karthik ) అనే వ్యక్తి తన భార్య పది నెలల వయస్సు ఉన్న బాబుతో చెన్నైకు బయలుదేరగా లండన్ లో అజిత్ కనిపించారని అజిత్ ఫోటో దిగడంతో పాటు నా భార్య ఒంటరిగా ప్రయాణిస్తుందనే విషయం తెలిసి ఆమె విమానం ఎక్కే వరకు అజిత్ తోడుగా ఉన్నారని చెప్పుకొచ్చారు.నా భార్య పరవాలేదని చెప్పగా నాకు ఇద్దరు పిల్లలున్నారని అర్థం చేసుకోగలనని అజిత్ నా భార్యతో చెప్పాడని కార్తీక్ కామెంట్లు చేశారు.

Hero Ajith Carrying His Fan Bag Goes Viral In Social Media Details, Ajith , Hero

అజిత్ స్వయంగా బేబీ బ్యాగ్ ను విమానం వరకు తీసుకెళ్లారని షటిల్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కూడా అజిత్ ఆమెకు సహాయం చేశారని కార్తీక్ తెలిపారు.అజిత్ వ్యక్తిత్వం నన్ను కదిలించిందని కార్తీక్ చెప్పుకొచ్చారు.కార్తీక్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అజిత్ సూపర్ స్టార్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు