కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.పరువునష్టం కేసులో భాగంగా పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఈ మేరకు పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.అనంతరం తదుపరి విచారణను ఆగస్ట్ 4వ తేదీకి వాయిదా వేసింది.
కాగా మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయనపై పరువునష్టం కేసు దాఖలైంది.
ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.







