తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ జెనీలియా( Genelia ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జెనీలియా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బొమ్మరిల్లు.
ఈ సినిమాలో హాసిని పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.ఈ సినిమాతో తెలుగులో ఢీ, ఆరెంజ్, సత్యం, హ్యాపీ, సై లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.ఇకపోతే జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

దేశ దేశముఖ్ తో కలిసి ఈమె పలు హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ఇక పెళ్లి తర్వాత పూర్తిగా ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఇంటికి పరిమితమైంది జెనీలియా.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవల కాలంలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది జెనీలియా.గతేడాది జెనిలియా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.తన భర్త రితేశ్ దేశ్‌ముఖ్ ( Riteish Deshmukh )తో తో కలిసి మిస్టర్ మమ్మీ, వేద్ సినిమాలతో అలరించింది.
ఇప్పుడు ఓటీటీలో అరంగేట్రం చేయడానికి సిద్ధమైంది.ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ట్రయల్ పీరియడ్( Trial Period ).ఈ వెబ్‌సిరీస్ జులై 21 నుంచి ఓటీటీ జియో సినిమా వేదికగా ప్రసారం కానుంది.ఈ సందర్భంగా జెనీలియా మీడియాతో మాట్లాడింది.
ఈ సిరీస్ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆమె తెలిపింది.ట్రయల్ పీరియడ్ కథ విన్న వెంటనే ఓకే చేశాను.

నేను రీఎంట్రీ ఇవ్వాలని అనుకునే సమయంలో ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది.సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ ను అంగీకరించేందుకు స్క్రిప్ట్ చదవడం కోసం ఎక్కువ సమయం తీసుకుంటాను.కానీ, ఈ వెబ్‌సిరీస్ కథను గంటలో చదివేసి ఓకే చేశాను.నాకు ఈ కథ అంత ఆసక్తిగా అనిపించింది.ఓటీటీలో కుటుంబమంతా కలిసి చూసే కథలు తగ్గిపోయాయని నా అభిప్రాయం.పిల్లలతో కలిసి మేం చాలా సినిమాలు చూడలేకపోతున్నాము.
అందుకే ట్రయల్ పీరియడ్ కథను ఎంచుకున్నాం.ఈ సిరీస్‌ను కుటుంబమంతా కలిసి చూడవచ్చు.
ఇటీవల విడుదలైన వేద్ సినిమా కూడా కుటుంబ కథా చిత్రమే అని జెనీలియా తెలిపింది.







