ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ, సీబఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కవిత బెయిల్ పిటిషన్లపై మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో విచారణ జరగనుంది.కాగా లిక్కర్ పాలసీ కుంభకోణం( Liquor Policy ) కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో జైలులో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈడీ కేసులో కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16నే వాదనలు జరగాల్సి ఉండగా.

న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది.జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉండగా.

Advertisement

ఆమె కస్టడీ రేపటితో ముగియనుంది.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు