మార్చి 8 న ఆరోగ్య మహిళ కేంద్రాలు ప్రారంభం - రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు

8 ప్యాకేజీలలో 57 రకాల పరీక్షల నిర్వహణప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు పరీక్షలుఆకస్మికంగా వచ్చే గుండెపోటు మరణాల నియంత్రణకు 2 లక్షల మందికి సిపిఆర్ శిక్షణ అందించాలి 18 కోట్లతో రాష్ట్రంలోని 1200 ఆరోగ్య కేంద్రాలకు ఏఈడి యంత్రాలు అందజేతకంటి వెలుగు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీని ప్రత్యేకంగా పర్యవేక్షించాలిసి.

పి.

ఆర్.శిక్షణ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, వడ్డి లేని రుణాలపై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా:మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం మార్చి 8న మహిళా దినోత్సవం నాడు వంద ఆరోగ్య మహిళ కేంద్రాలనుప్రారంభిస్తుందని, ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి లతో కలిసి ఆరోగ్య మహిళ, సిపిఆర్ శిక్షణ, కంటి వెలుగు, వడ్డీ లేని రుణాలు, తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశం మందిరం నుంచి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్ ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా అధికారులతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో రాజేంద్రనగర్ లో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం వల్ల రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడటం జరిగిందని, కరోనా తరువాత కారణాలు తెలియకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఆకస్మికంగా గుండె పోటు వచ్చి చనిపోతున్నారని, ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో 19 సంవత్సరాల యువకుడు పెళ్లి వేడుకలో మరణించారని, సిపిఆర్ చేయడం వల్ల ఆకస్మికంగా గుండె పోటు వచ్చే వారిలో 50% మంది ప్రాణాలు కాపాడవచ్చని మంత్రి తెలిపారు.

వైద్య శాఖ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 24 వేల మంది ఆకస్మిక గుండె పోటు తో చనిపోతున్నారని, వీరిలో సగం మందిని కాపాడే అవకాశం సిపిఆర్ ద్వారా లభిస్తుందని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి సిపిఆర్ శిక్షణ అందించాలని, హెల్త్ వర్కర్స్, స్వశక్తి మహిళా సంఘాలు, ఆర్టిసి సిబ్బంది, పోలిస్ సిబ్బంది, షాపింగ్ మాల్స్ , అపార్ట్మెంట్ నిర్వాహకులు, టీచర్స్ మొదలగు వివిధ వర్గాల ప్రజలకు శిక్షణ అందించడం జరుగుతుందని, ప్రతి జిల్లాలో మార్చి 13 నుంచి సిపిఆర్ శిక్షణ ప్రారంభించాలని , స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని మంత్రి తెలిపారు.

Advertisement

జిల్లాలో సిపిఆర్ శిక్షణ అందించేందుకు ప్రతి జిల్లాకు 5 నుంచి 7 మాస్టర్ ట్రైయినర్లను అందుబాటులో ఉంచి ప్రతి రోజూ కనీసం 300 మందికి శిక్షణ అందించేలా కలెక్టర్ లు పర్యవేక్షణ చేయాలని, జిల్లాలో మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 ఆరోగ్య కేంద్రాలలో ఏఈడీ యంత్రాలను 18 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 63.82 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 11.42 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాల పంపిణీ, 8.02 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను అందించుటకు ఆర్డర్ చేశామని అన్నారు.జిల్లాలో ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను సకాలంలో పంపిణీ చేయాలని, కలెక్టర్ లు ప్రతి రోజూ వీటిని పర్యవేక్షించాలని, ప్రతి రోజూ ప్రతి శిబిరానికి కనీసం 100 మంది వచ్చేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని మంత్రి తెలిపారు.

మార్చి 8న మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాలలో ముందస్తుగా ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో వీటిని మరింత విస్తరిస్తామని మంత్రి హరిష్ రావు తెలిపారు.ఆరోగ్య మహిళ క్రింద ప్రతి మంగళవారం 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్,బస్తిదవాఖానాలో మహిళల కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఈ క్లినిక్ లో మహిళల కు 8 ప్యాకేజీ లో 57 రకాల పరీక్షలను చేయడం జరుగుతుందని, ప్రాథమిక డయాగ్నాస్టిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, వెయిట్ మేనేజ్మెంట్, మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ, సెక్సువల్ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్, పిసిఓడి, రుతుస్రావ సమస్యలు, ఇన్ ఫెర్టిలిటీ మేనేజ్మెంట్, మెనోపాజ్ మేనేజ్మెంట్, ఐవి, యూటిఐ&పెల్విక్ ఇన్ ఫ్లమేంటరి డిసిజెస్ వంటి అంశాలు పరీక్షించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్రంలో 26 జిల్లాలలో తెలంగాణ డయాగ్నిస్టిక్ అందుబాటులో ఉన్నాయని, ఏప్రిల్ చివరి నాటికి మరో 7 జిల్లాలో ఏర్పాటవుతాయని అప్పటి వరకు సమీప జిల్లాకు లింక్ చేశామని, శాంపిల్ ఇతర జిల్లా కేంద్రాలకు తరలించేందుకు అదనపు వాహనాలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.

మహిళలలో ఉన్న పోషకాల లోపం నివారణ కోసం క్లినిక్ లో డీ3, బీ12 తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తామని అన్నారు.బరువు సంబంధించిన అంశంలో న్యూట్రిషన్ సూచించి, అవసరమైన యోగా, వ్యాయమాలకు సంబంధించిన వీడియోఅందజేస్తామనిఅన్నారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ

మహిళా క్లినిక్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుందని, అనుమానితులకు, లక్షణాలు ఉన్న వారికి జిల్లా స్థాయిలో మామోగ్రామ్, బయాప్సి, పాప్స్ మీర్, కోల్పోస్కోపి పరిక్షలు నిర్వహించి, క్యాన్సర్ నిర్థారణ జరిగితే నిమ్స్ ఎంఎన్ జే లో చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.మహిళా క్లినిక్ కు వచ్చే పేషెంట్ల వివరాలు ప్రత్యేక యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని, వీటిని రిఫరల్ ఆసుపత్రికి లింక్ చేస్తామని, జిల్లా ఆసుపత్రిలో ఇబ్బందులు కల్గకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

Advertisement

జిల్లాల్లో త్వరితగతిన సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులు, ఇతర మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.మహిళా దినోత్సవం నాడు 2 సంవత్సరాల పెండింగ్ వడ్డి లేని రుణం బకాయిలు 650 కోట్ల నిధులు విడుదల చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయి వేడుకలలో గ్రామీణ సంఘాలకు , మెప్మా సంఘాలకు చెక్ లు అందించాలని మంత్రి తెలిపారు.

Latest Rajanna Sircilla News