మహమ్మారి కరోనా బెడద పోయింది అని అనుకున్న తర్వాత మనిషి ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయి.చాలామంది రకరకాల శారీరక సమస్యలతో బాధపడుతున్నారు.
ఎక్కువగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు.ఇటీవల వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటు కారణంగా మరణిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు.నిన్న మేడ్చల్ శివారులో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుండెపోటుకు గురై మరణించడం జరిగింది.
ఇలా విద్యార్థులు వరుసగా గుండెపోటుకు గురై మరణిస్తూ ఉండటంతో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండే కాలేజీ విద్యార్థులకు నిర్బంధ వైద్య పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.ఈసీజీ, బ్లడ్ టెస్ట్ లాంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.ఇందుకు ఆసుపత్రులు డయాగ్నస్టిక్ సెంటర్ యాజమాన్యాలు సహకరించాలని సూచించారు.అదేవిధంగా CPR పై పోలీస్ మున్సిపల్ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని మంత్రి గంగుల పేర్కొన్నారు.