ప‌ది నిమిషాలు సూర్య నమస్కారాలు చేస్తే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటారు.ఆరోగ్యంగా ఉంటే ఎలాగైనా ఆనందంగా ఉండొచ్చు.

అయితే నేటి కాలంలో మారిన జీవ‌న శైలి కార‌ణంగా ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య ఎప్ప‌టిక‌ప్పుడు చుట్టు ముడుతూనే ఉంటుంది.అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉండాలంటే.

పోష‌కాహారం, స‌రైన నిద్ర‌, వ్యాయామ‌ల‌తో పాటు ప్ర‌తి రోజు సూర్య న‌మ‌స్కారాలు చేయ‌డం కూడా అల‌వాటు చేసుకోవాలి.ఎందుకంటే.

కేవ‌లం ప‌ది నిమిషాల‌ పాటు సూర్య న‌మ‌స్కారాలు చేయ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని బినిఫిట్స్ పొందొచ్చు.మ‌రి ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

Advertisement

సూర్య కిరణాలు డైరెక్ట్ గా మనపై పడే ప్రదేశంలో సూర్య న‌మ‌స్కారాలు చేయాల్సి ఉంటుంది.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళన త‌గ్గుతుంది.

రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.మెదడుకి మంచి రిలాక్సేషన్ ని అందుతుంది.

త‌ద్వారా ప్ర‌తి విష‌యంలోనూ పాజిటివ్‌గా ఆలోచించ‌గ‌ల‌రు.అలాగే మ‌ధుమేహం స‌మ‌స్య ఉన్న వారు ఖ‌చ్చితంగా క్ర‌మం త‌ప్ప‌కుండా సూర్య న‌మ‌స్కారాలు చేయాలి.

సూర్య న‌మ‌స్కారాల వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.ప్ర‌తి రోజు ప‌ది నిమిషాల పాటు సూర్య న‌మ‌స్కారాలు చేయ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులు, జీర్ణకోశ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.ఇక సూర్య న‌మ‌స్కారాల వ‌ల్ల విట‌మిన్ డి ల‌భిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలి అనుకుంటున్నారా..? అయితే ఈ ఒక్క పదార్థం చాలు..!

ఈ విట‌మిన్ డి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డ‌టానికి స‌హాయ‌ప‌డుతుంది.అలాగే సూర్య న‌మ‌స్కారాల వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది.

Advertisement

ముఖ్యంగా చ‌ర్మంపై ముడ‌త‌లు పోయి.య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుతుంది.

సూర్య న‌మ‌స్కారాల మ‌రో అద్భుత‌మైన బెనిఫిట్ ఏంటంటే.వెయిట్ లాస్‌.

అధిక బ‌రువు ఉన్న వారు సూర్య న‌మ‌స్కారాలు చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో అద‌న‌పు కొవ్వు క‌రుగుతుంది.అదే స‌మ‌యంలో థైరాయిడ్ గ్లాండ్స్ స‌క్ర‌మంగా ప‌ని చేసేలా చేస్తుంది.

త‌ద్వారా బ‌రువులో అదుపులోకి వ‌స్తుంది.సో.ప్ర‌తి రోజు సూర్య న‌మ‌స్కారాల‌కు ప‌ది నిమిషాలు కేటాయిస్తే.పైన చెప్పిన ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌న్నీ పొందొచ్చు.

తాజా వార్తలు