వాము ఆకుల‌తో జ‌లుబు, ద‌గ్గుకు చెక్ పెట్టేయండిలా?

ఈ వింట‌ర్ సీజ‌న్‌లో చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ పడుతుంటారు.

వాతావరణంలో మార్పులు, చల్లటి గాలులు, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం, ఆహారంలో మార్పులు ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల‌ జ‌లుబు, ద‌గ్గు స‌మ‌స్య‌లను ఎద‌ర్కోవాల్సి వ‌స్తుంది.

ఇక జ‌లుబు, ద‌గ్గు ప‌ల‌క‌రించ‌గానే చాలా మంది ట‌క్కున మందులు లేదా సిర‌ప్స్ వేసుకుంటుంటారు.అయితే మందుల‌తో కాకుండా న్యాచుర‌ల్‌గా కూడా ఈ స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

ఇక జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో వాము ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.వాము ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు.

అయితే వామే కాదు.వాము ఆకులతో కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

Advertisement

వాస్త‌వానికి కొంద‌రు వాము ఆకుల‌తో వ‌డ‌లు, ప‌చ్చ‌ళ్లు వంటివి కూడా చేస్తుంటారు.మంచి సువాస‌న‌, మంచి టేస్ట్ ఉండే వాము మొక్క‌లను ఇంట్లోనే పెంచుకుంటారు.

అయితే ఈ మొక్క‌ల నుంచి వాము వ‌స్తుంది అనుకుంటే పొర‌పాటే.ఎందుకంటే, వాము వ‌చ్చే మొక్క‌లు వేరు.

వాము ఆకులు వ‌చ్చే మొక్క‌లు వేరు.వాము విష‌యం ప‌క్క‌న పెట్టేస్తే.

వాము ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వాము ఆకుల‌ను నీటితో బాగా మ‌రిగించి.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఆ నీటిలో కొద్దిగా తేనె క‌లుపుకుని తాగితే.ద‌గ్గు జ‌ల‌బు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

Advertisement

ఈ వాము ఆకుల‌ను వంట‌ల్లో కూడా వాడుకోవ‌చ్చు.వాము ఆకులు తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

కాబ‌ట్టి, మ‌ధుమేహం ఉన్న వారు వాము ఆకుల‌ను తీసుకోవ‌డం మంచిది.అంతేకాకుండా.

వాము ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగించి.మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.

ఫ‌లితంగా గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉండ‌డంతో పాటు ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.అలాగే బాగా ఒత్తిడిగా ఉన్న స‌మ‌యంలో వాము ఆకుల‌తో త‌యారు చేసిన డికాషన్ తాగితే.

మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఈ ఆకుల డికాష‌న్ తాగడం వ‌ల్ల క‌డుపు నొప్పి మ‌రియు అజీర్తి వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

తాజా వార్తలు