వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలి

నల్లగొండ జిల్లా: గత 20 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ పురుష పోస్టులను భర్తీ చేయడంలో గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయని హెల్త్ అసిస్టెంట్ నిరుద్యోగ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూడుదుడ్ల రమేష్ కుమార్ అన్నారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ హెల్త్ అసిస్టెంట్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు గత 20 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు వయస్సు కూడా ఉద్యోగరీత్యా ప్రమాదంలో పడిందని అన్నారు.

వచ్చే నెలలో వైద్య ఆరోగ్యశాఖలో జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేసే వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.ప్రభుత్వం త్వరలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ తీసుకురావాలని భావిస్తున్న తరుణంలో ఈ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాల్సి అవసరం ఉందన్నారు.

రాష్ట్ర అధ్యక్షులు పల్లె రాములు, ప్రధాన కార్యదర్శి భోగా అనిల్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

నవంబర్ 3న బీసీ గర్జన ను విజయవంతం చేయాలి : బీసీ జేఏసీ
Advertisement

Latest Nalgonda News