తేనె( honey ) అంటే ఇష్టపడని వారు ఉండరు.ఎంతో తీయగా ఉండే ఇది ప్రకృతి సిద్ధంగా లభ్యం అవుతుంది.
అయితే మార్కెట్‌లో ప్రస్తుతం ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తోంది.ఎందుకంటే ప్రతి ప్రొడక్ట్ కల్తీవే కనిపిస్తున్నాయి.
దీంతో అవి తిని అనారోగ్యం పాలవుతున్నారు ప్రజలు.ముఖ్యంగా ఇలాంటి ఘటనలను జరిగినప్పుడు మాత్రమే కొందరు ఆలోచిస్తారు.,/br>
వివిధ బ్రాండ్ల కంపెనీల తేనె ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.అయితే వాటిని కూడా పూర్తిగా నమ్మలేం.వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఏవైనా హానికర పదార్థాలు వాడుతుండొచ్చు.
అయితే తేనె అంత తొందరగా పాడవదు.కొన్ని ఏళ్ల పాటు అది తాజాగా ఉండే అవకాశం ఉంది.
అయితే ఇది తాజాగా ఉన్నదా, లేక కల్తీదా అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి.ఇదే కోవలో ఓ వ్యక్తి వెరైటీగా ప్రయత్నించాడు.
రూ.200ల నోటును( 200 note ) ఎవరైనా పడేస్తారా అంటే వెంటనే నో అంటాం.దానిని కాలుస్తారా అన్నా ఎవరూ అలా చేయరని చెబుతుంటాం.అయితే ఓ వ్యక్తి రూ.200ల నోటుకు నిప్పు పెట్టాడు.అతడు ఓ డబ్బున్న వ్యక్తి అనుకుంటే పొరపాటు.తేనె అమ్ముకుని జీవించే ఓ వ్యక్తి అలా చేశాడు.తాను విక్రయించే తేనె ఎంత స్వచ్ఛమైందో దానిని కొనుగోలు చేసే వారికి తెలిపేందుకు ఇలా వినూత్నంగా ప్రయత్నించాడు.రూ.200ల నోటుపై అతడు మొదటగా తేనె పోశాడు.తర్వాత దానికి నిప్పంటించగానే ఏ మాత్రం అది అంటుకోలేదు.
దీంతో అది స్వచ్ఛమైన తేనెగా మనం అర్ధం చేసుకోవచ్చు.ఇక తేనెలో కల్తీలు( Adulteration in honey ) ఉంటాయి.
తేనెలో కొందరు బెల్లం పానకం కలిపి విక్రయిస్తుంటారు.అయితే మనం కొనే తేనె స్వచ్ఛమైందో లేదో తెలుసుకునేందుకు ఇలా చేయొచ్చు.అయితే రూ.200ల నోటుతో కాకుండా తక్కువ నోటుతో ప్రయత్నిస్తే మంచిది.అంతేకాకుండా ఏదైనా అగ్గి పుల్లను తేనెలో ముంచి దానిని వెలిగించి కూడా తేనె స్వచ్ఛతను తెలుసుకోవచ్చు.