వాట్సాప్ కొత్త క్యాంపెయిన్ చూశారా.. భద్రతకు భరోసా అంట!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్( WhatsApp ) వినియోగదారుల భద్రతకు ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తుంది.

కాబట్టే నానాటికీ దానికి యూజర్ల సంఖ్య పెరుగుతున్నారే తప్పితే తగ్గడం లేదు.

ఇదే క్రమంలో భద్రతకు సంబంధించిన ఫీచర్లపై వినియోగదారులకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి.అదే ‘స్టే సేఫ్ విత్ వాట్సాప్’ అంటే? వాట్సాప్ తో భద్రంగా ఉండండి అనే స్లోగన్ తో ప్రత్యేక క్యాంపెయిన్ ను ఒకటి వాట్సాప్ ఇపుడు రన్ చేయడం నిజంగా ఆహ్వానించదగ్గ విషయం.

కాగా ఈ కార్యక్రమం దాదాపు మూడు నెలల పాటు కొనసాగునుంది.ఈ కాలంలో వాట్సాప్ సేఫ్టీ ఫీచర్లపై( WhatsApp safety features ) వినియోగదారులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనుంది.ముఖ్యంగా ‘బ్లాక్ అండ్ రిపోర్ట్’, ‘టూ స్టెప్ వెరిఫికేషన్’, ‘ప్రైవసీ అండ్ గ్రూప్ సెట్టింగ్స్’ ఆప్షన్లపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ క్రమంలో వినియోగదారులు ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాలు మరియు ఖాతా ట్యాంపరింగ్ వంటి ప్రమాదాల గురించి తెలుసుకుంటారు.తద్వారా వాటిని నివారించడానికి ఇది ప్రజలకు సహాయపడుతుంది.

Advertisement

టూ స్టెప్ వెరిఫికేషన్( Two Step Verification ) ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా వినియోగదారులు తమ ఖాతాలకు అదనపు భద్రత అనేది ఏర్పడుతుంది.మీ వాట్సాప్ ఖాతాను రీసెట్ చేసేటప్పుడు, ఆరు అంకెల పిన్ తప్పకుండా అవసరం అవుతుంది.అలాగే ఖాతాను ‘బ్లాక్ అండ్ రిపోర్ట్’ చేయడానికి సులభమైన మార్గాన్ని కూడా ఇపుడు వాట్సాప్ అందిస్తోంది.

అంటే బ్లాక్ చేయబడిన నంబర్‌ల నుంచి మీకు కాల్ లేదా సందేశాలు వంటివి రావు.ఇంకా ప్రొఫైల్ ఫొటో, లాస్ట్ సీన్, స్టేటస్ వంటి వాటిని ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు అనేది వినియోగదారులు డిసైడ్ చేసుకోవచ్చు.

ఇలా ప్రతి విషయంపైన ఈ ప్రోగ్రాం ద్వారా అవగాహన తెచ్చుకోవచ్చు.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు