కోవిడ్ వల్ల 10 మంది కుటుంబ సభ్యులను కోల్పోయా: అమెరికా సర్జన్ జనరల్ డా. వివేక్ మూర్తి

కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు.ఆసుపత్రులకు జనం పరుగులు.

పక్కవాడు తుమ్మినా, దగ్గినా వాడిని నేరస్తుడిని చూసినట్లు చూడటం, వేరే వూరి నుంచి వస్తే సొంతవాళ్లనైనా అడుగుపెట్టనీయకపోవడం, కోట్ల ఆస్తి, బంధుగణం వున్నా దిక్కులేని వాడిలా అంత్యక్రియలు ఇలా కనీసం కలలో కూడా ఊహించని దారుణాలు ఎన్నో.వీటన్నింటికి మించి అయినవారిని కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయం.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు మొదలైనా ఈ మహమ్మారి మనిషికి లొంగడం లేదు.తనకు తాను ఉత్పరివర్తనం చెంది మానవాళికి సవాల్ విసురుతోంది.

సామాన్యులతో పాటు అత్యున్నత పదవుల్లో వున్నవారు సైతం తమ వారిని వైరస్ బారి నుంచి రక్షించుకోలేకపోయారు.తాజాగా అమెరికా సర్జన్ జనరల్‌గా వున్న భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి కుటుంబంలో 10 మందిని కోవిడ్ మహమ్మారి బలి తీసుకుంది.

Advertisement

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.రెండవసారి అమెరికా సర్జన్ జనరల్ పదవిని పొందిన వివేక్ మూర్తి వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.

ప్రజలు కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఖచ్చితంగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.తన కుటుంబంలో జరిగిన విషాదం మరే ఇంట్లోనూ జరగకుండా వుండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని వివేక్ మూర్తి విజ్ఞప్తి చేశారు.

వ్యాక్సిన్ పిల్లలకు వేయడానికి ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి.కానీ నా ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే, వారి లాంటి చిన్నారులను వైరస్ నుంచి కాపాడాలంటే ముందు మనం టీకా వేయించుకోవాలన్నారు.

వ్యాక్సినేషన్‌కు సంబంధించి తాను ప్రతివారం దేశవ్యాప్తంగా వున్న వైద్యులు, నర్సులతో మాట్లాడుతున్నానని వివేక్ మూర్తి చెప్పారు.టీకాలు వేసుకోని వారే ఎక్కువగా వైరస్ బారినపడుతున్నట్లు వారు తనతో చెప్పారని ఆయన వెల్లడించారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కొందరు తప్పుదారి పట్టించడం వల్ల వ్యాక్సిన్ వేయించుకోవడానికి పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు వివేక్ మూర్తి పేర్కొన్నారు.కాని మనలో ప్రతి ఒక్కరూ కోవిడ్‌పై పోరాడాలి.

Advertisement

ఎందుకంటే మనందరి జీవితాలు దానిపైనే ఆధారపడి వున్నాయని వివేక్ మూర్తి హితవు పలికారు.

ఇప్పటి వరకు 160 మిలియన్ల మంది అమెరికన్లకు టీకాలు వేయించామన్నారు.కానీ కోవిడ్ నుంచి ఇంకా మిలియన్ల మంది అమెరికన్లకు రక్షణ లభించాల్సి వుందన్నారు.తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించామని.

విశ్వసనీయమైన, శాస్త్రీయమైన వనరుల ద్వారా సమాచారాన్ని సేకరించి ప్రజలతో పంచుకుంటామని మూర్తి చెప్పారు.అలాగే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తల్లిదండ్రులకు సహాయపడేందుకు ఆన్‌లైన్‌లో అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించిందని డాక్టర్ వివేక్ మూర్తి పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఆరోగ్య అక్షరాస్యతను మెరుగుపరచడంలో సహాయపడాలని ఆయన దేశంలోని విద్యాసంస్థలను కోరారు.

తాజా వార్తలు