ఈ మంకీకి హ్యాట్సాఫ్.. మరణం అంచుల్లో ఉన్న మరో కోతికి పునర్జన్మ..

ఎవరైనా ప్రమాదంలో ఉన్నపుడు వారిని వెంటనే కాపాడేందుకు ఫస్ట్ ఎయిడ్ చేయడం ప్రతీ ఒక్కరి ధర్మం.ఒకవేళ జంతువు ప్రమాదంలో ఉన్నా దానిని రక్షించేందుకు ప్రయత్నించాలి.

అది మానవ ధర్మంతో పాటు మానవత్వం కూడా.కాగా, అటువంటి ధర్మాన్ని కోతి కూడా కలిగి ఉంది.

సాటి కోతి మరణపు అంచుల్లో ఉన్నపుడు దానిని కాపాడి, దానికి పునర్జన్మను ప్రసాదించింది ఓ మంకీ.ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

వీడియో వివరాల్లోకెళితే.విద్యుత్ షాక్‌కు గురై ఓ కోతి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

Advertisement

దాంతో అక్కడే ఉన్న మరో మంకీ దాని వద్దకు వచ్చింది.వైద్యుడి మాదిరిగానే ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోతి వెన్నుపైన మర్దన చేయడంతో పాటు దానిని కొరికినట్లు చేసింది.

ఈ క్రమంలోనే ఓ నీటి గుంటలో సదరు కోతిని పడేసి .మళ్లీ బయటకు తీసింది.అలా కొద్ది సేపు కోతిని కొరుకుతూ, వెన్నుపై మర్దన చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సహచరకోతి ప్రాణాలు నిలిపి పునర్జన్మ ప్రసాదించింది మరో మంకీ.

ఆ మంకీ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయి ప్రాణాపాయ స్థితి నుంచి కోతి బయటపడింది.ఇదంతా కూడా ఒకరు వీడియోలో రికార్డు చేశారు.రిబకా హెచ్2030 అనే ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించిన వీడియో తన అకౌంట్‌లో షేర్ చేయగా,అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఈ వీడియో చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారను.సాటి కోతి ప్రాణాలు కాపాడేందుకు మరో కోతి ప్రయత్నిస్తున్నదని, కానీ, ప్రస్తుత సమాజంలో కొందరు మనుషులు మరో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు అస్సలు ముందుకు రావడం లేదని అంటున్నారు.ఈ కోతికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలని, వైద్యుడి మాదిరిగా మారి సాటి కోతికి ప్రాణం పోసిందని కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ కి వెళ్తే కెరియర్ పిప్పి కావాల్సిందే.. దండం పెట్టేసిన యూట్యూబర్!
Advertisement

తాజా వార్తలు