ఆయన చేసిన మోసానికి కోదండరామ్ కి అడుక్కునే పరిస్థితి వచ్చిందా..?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతోమంది విద్యార్థులు, మేధావులు ఎన్నో త్యాగాలు చేశారు.అలాంటి తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొఫెసర్ కోదండరాం( Kodandaram ).

కేసీఆర్ ( Kcr ) వెంట వెన్నుదన్నులా ఉండి, ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు ఇస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.ఆయన ఆలోచన మీద ముందుకు వెళ్లారు కాబట్టి రాష్ట్రం సిద్ధించింది.ఇక రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తో పాటు వారి కుటుంబం, మిగతా నాయకులంతా రాజకీయంగా బలపడ్డారు.

కానీ ఉద్యమానికి ఎంతో ఊతం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ కోదండ రామ్ మాత్రం భంగపడ్డారు.అతన్ని కేసీఆర్ ఏ విధంగా కూడా ఆదుకోకపోవడంతో ఆ పార్టీ నుంచి కోదండరాం బయటకు వచ్చేశారు.

రాజకీయంగా బలపడేందుకు తెలంగాణ జన సమితి ( Telangana Jana Samithi ) పేరుతో ఒక కొత్త పార్టీని పెట్టారు.కానీ కేసీఆర్ శక్తి ముందు ఆ పార్టీ ప్రజల్లోకి అంతగా వెళ్లలేకపోయింది.

Advertisement

దీంతో రాజకీయాల పరంగా ప్రొఫెసర్ కోదండరాం అట్టర్ ఫ్లాప్ అయ్యారు.ఇక చేసేదేమీ లేక ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కంకణం కట్టుకున్నారు.

కేసీఆర్, బీఆర్ఎస్ (BRS) ను గట్టిగా ఢీకొట్టేది కేవలం కాంగ్రెస్ మాత్రమే అని గ్రహించిన కోదండరాం ఆ పార్టీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కోదండరామ్ కు ఆరు సీట్లు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారట.ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే, ఇన్చార్జి థాక్రే ,టీపీసీసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిల ( Revanth reddy ) ను కలిసి వారికి 6 సీట్లు కేటాయించాలని అడుగుతున్నారట.

అలాగే జన సమితి గుర్తు పేరు మీద కాకుండా, కాంగ్రెస్ చేయి గుర్తు మీదే నేను పోటీ చేస్తానని వారికి హామీ కూడా ఇచ్చారట.మరి కాంగ్రెస్ పెద్దలు కోదండరామ్ ( Kodandaram ) కి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఈయన వల్ల కాంగ్రెస్ కు ఏమైనా లాభం జరుగుతుందా లేదా అనేది ఆలోచన చేస్తున్నారట.

ఈ విధంగా ఎంతో పేరు ఉన్నటువంటి కోదండరామ్ కేసీఆర్ మోసం వల్ల అడుక్కునే పరిస్థితికి వచ్చారని ప్రజలు భావిస్తున్నారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు