సాధారణంగా ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న వ్యక్తులు చాలామంది ఉంటారు.కొందరు నచ్చని పెళ్లి చేసుకుని ఆ తరువాత నచ్చిన వారితో లేచిపోయిన వార్తలు అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం.
పైగా ఇలాంటి వార్తలు సర్వసాధారణమే.అయితే ఒక పెళ్లిలో( Wedding ) జరిగిన విచిత్ర సంఘటన సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.
పెళ్లి జరగడానికి కొన్ని క్షణాల ముందు పెళ్లికూతురు కి ఏదో తెలియని అనుమానం కలిగింది.వెంటనే పెళ్లి మండపం నుండి బయటకు పరుగులు తీసి పక్కనే ఉన్న క్యారవ్యాన్ లోకి తొంగి చూస్తే ఊహించని షాక్ ఎదురైంది.
దీంతో ఆ వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.పెళ్లి మండపంలో ఉండే బంధువులతో పాటు స్నేహితులు కూడా ఈ విచిత్ర ఘటన చూసి ఆశ్చర్యపోయారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఏమిటంటే.ఓ వివాహ వేడుక బంధువులు, స్నేహితులు ఇంకా ఇతర తెలిసిన వ్యక్తులతో కిటకిటలాడుతోంది.వధువు( Bride ) అందంగా ముస్తాబై తన కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి కళ్యాణ మండపానికి వచ్చింది.అయితే ఎంతసేపైనా వరుడు( Groom ) పెళ్లి మండపానికి రాకపోవడంతో పెళ్లికూతురికి ఏదో తెలియని అనుమానం కలిగింది.
వరుడు క్యారవ్యాన్ లో ఉన్నాడు అనే వార్త వధువుకు తెలియడంతో వెంటనే బయటకు పరుగులు తీసి క్యారవ్యాన్ వద్దకు వెళ్ళింది.

డోర్ క్లోజ్ చేసి ఉండడంతో వెనుక వైపుకు వెళ్లి అద్దంలో నుంచి చూస్తే వరుడు మరొక మహిళతో అసభ్యకర రీతిలో ఉండడం కనిపించింది.వధువు కన్నీళ్లు పెట్టుకుంటూ తాను మోసపోయానంటూ ఏడవడం మొదలు పెడితే బంధువులతో పాటు కుటుంబ సభ్యులు అందరూ వధువును ఓదార్చారు.వధువు వివాహం క్యాన్సిల్( Marriage Cancel ) చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కేవలం ఒక్క రోజులోనే ఆ వీడియోకు 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
నెటిజన్స్ అంతా ఈ విషయం పెళ్లికి ముందే తెలియడం ఒకరకంగా మంచేనని అంటున్నారు.ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.







