ధోని కెరియర్ ముగిసినట్లే... హర్షా బొగ్లె ఆసక్తికర వాఖ్యలు

టీం ఇండియాకి తిరుగులేని సారధిగా నడిపించి, ఇండియా క్రికెట్ టీం అప్రతిహిత జైత్రయాత్రలో కీలకంగా మారిన మహేంద్ర సింగ్ ధోని కెరియర్ చివరి దశకి వచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.

ఇప్పటికి కూడా మంచి ఫిట్ నెస్ తో టీంలో కొనసాగుతూ పర్వాలేదనే విధంగా ఆడుతున్న ధోని చాలా కాలంగా టీం ఇండియాకి దూరంగా ఉన్నాడు.

ఇండియాకి రెండు వరల్డ్ కప్ లు అందించిన ధోని తర్వాత కెప్టెన్ అయిన విరాట్ ఇప్పుడు టీం ఇండియాని అద్భుతంగా నడిపిస్తున్నాడు.ఈ నేపధ్యంలో టీంలోకి వచ్చే కొత్త ఆటగాళ్ళు మంచి ప్రతిభ చూపిస్తూ సత్తా చాటుతున్నారు.

ఈ నేపధ్యంలో ధోనిని సెలక్షన్ కమిటీ పెద్దగా పరిగణంలోకి తీసుకోవడం లేదు.ఇదిలా ఉంటె సీనియర్ కామెంటేటర్ హ‌ర్షా బోగ్లే మాట్లాడుతూ జాతీయ‌జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌డానికి ధోనికి దారులు మూసుకుపోయినట్లు తనకు అనిపిస్తుందని తెలిపాడు.టీ20 ప్రపంచ కప్ కోసం ధోనీని జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్‌ భావిస్తున్నట్లు తనకు అనిపించడం లేదని, ఒకవేళ ఐపీఎల్ జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని వ్యాఖ్యానించాడు.కరోనా వైరస్ కారణంగా క్రికెట్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతాయో, స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఈ నేపధ్యంలో ప్రాక్టీస్ లేకుండా ఇంటి వద్దనే ఉన్న ధోనిని మళ్ళీ టీంలోకి తీసుకోవడం అనేది జరిగే అవకాశం లేదని చెబుతున్నాడు.ఈ నేపధ్యంలో ధోని రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే సరైన సమయమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.

Advertisement
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు