వంద కోట్ల సినిమా తీసినా ఇంకా సైలెంట్‌ గా ఉండటానికి కారణం ఏంటి హను గారు..!

అందాల రాక్షసి అనే విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి దర్శకుడిగా తనను తాను ప్రత్యేకంగా ఆవిష్కరించుకున్న దర్శకుడు హను రాఘవపూడి.ఈయన దర్శకత్వం లో ప్రస్తుతం రూపొందుతున్న సినిమా ఏంటి అంటే ఎవరి వద్ద సమాధానం లేదు.

Hanu Raghavapudi New Film Not Yet Confirmed,hanu Raghavapudi,sitaramam,andala Ra

గత ఏడాది ఈయన దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా సీతారామం అనే సినిమా ను తెరకెక్కించాడు.ఆ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టిన సీతారామం సినిమా తర్వాత హను రాఘవపూడి ఇప్పటి వరకు కొత్త సినిమా ను మొదలు పెట్టలేదు.అసలు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అనే విషయం లో క్లారిటీ లేదు.

Hanu Raghavapudi New Film Not Yet Confirmed,hanu Raghavapudi,sitaramam,andala Ra

ఒకరు ఇద్దరికీ ఇప్పటికే కథలు చెప్పాడని వార్తలు వస్తున్నాయి.100 కోట్ల దర్శకుడుని ఆ హీరోలు ఎందుకు పట్టించుకోవడం లేదు అర్థం కావడం లేదు అనే టాక్ వినిపిస్తుంది.ఒక హిట్‌ ఇస్తే రెండు మూడు ఫ్లాప్స్ అన్నట్లుగా హను రాఘవపూడి కెరియర్ సాగుతోంది.

అందుకే ఆయన ను హీరోలు నమ్మడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.మంచి కథ తో వెళ్తే ఏ దర్శకుడినైనా యంగ్ హీరోలు సపోర్ట్‌ చేస్తారు అనడం లో సందేహం లేదు.

Advertisement
Hanu Raghavapudi New Film Not Yet Confirmed,hanu Raghavapudi,sitaramam,andala Ra

100 కోట్ల సినిమా తీసిన హను రాఘవపూడిని జనాలు కచ్చితంగా ఆదరిస్తారు.అభిమానిస్తారు.అందుకే మరో సారి ఆయన ఒక మంచి అద్భుతమైన ప్రేమ దృశ్యకావ్యం ను తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

యంగ్ హీరోల్లో చాలా మంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు.వారిని ఉపయోగించుకుని మరో సీతారామం రేంజ్ కమర్షియల్ లవ్ స్టోరీ ని తెరకెక్కించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఇలా సైలెంట్ గా ఉంటే ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు