సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అందుకున్న స్టార్ హీరోలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ముందువరసలో ఉంటారు.ప్రముఖ నిర్మాతలలో ఒకరైన నట్టి కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.
పవన్ ను హైపర్ ఆది దేవుడిలా భావిస్తారు కాబట్టి హైపర్ ఆది రోజాపై విమర్శలు చేశారని ఆయన కామెంట్లు చేశారు.ఎవరి పార్టీని వాళ్లు కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.
చిరంజీవి వల్ల లబ్ధి పొందిన వాళ్లు ఎంతోమంది ఉన్నారని చిరంజీవి, పవన్ కాళ్లు పట్టుకుని వాళ్ల ద్వారా అవకాశాలు పొంది ఇప్పుడు వాళ్లే సెటైర్లు వేస్తున్నారని నట్టి కుమార్ తెలిపారు.ఇప్పుడు వాళ్లే పవన్ పై పోటీ చేస్తానని కామెంట్లు చేస్తున్నారంటూ అలీపై నట్టి కుమార్ కామెంట్లు చేశారు.
చిరంజీవి, పవన్ లను కొంతమంది నటులు వెన్నుపోటు పొడిచారని నట్టి కుమార్ పరోక్షంగా కామెంట్లు చేశారు.

జనసేన పార్టీ సభలో హైపర్ ఆది అవతలి వాళ్లు మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడం సాధారణం అని పేర్కొన్నారు.నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చారని నట్టి కుమార్ తెలిపారు.ఇక్కడ ఎవరినీ ఎవరూ బెదిరించరని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.
పొలిటికల్ గా తిట్టుకోవడం తప్పు కాదని అయితే కుటుంబాల జోలికి మాత్రం వెళ్లడం తన దృష్టిలో కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతగా రోజా డ్యూటీ రోజా చేశారని హైపర్ ఆది డ్యూటీ హైపర్ ఆది చేశారని నట్టి కుమార్ తెలిపారు.పోసాని కృష్ణమురళి పదవి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారని ఆయన కామెంట్లు చేశారు.తన దృష్టిలో రోజా బెస్ట్ మినిష్టర్ అని నట్టి కుమార్ పేర్కొన్నారు.
నట్టి కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.