టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో నిర్వహించనున్న పాదయాత్రకు కండీషన్లు పెట్టడం సరికాదని ఆ పార్టీ నేత బోండా ఉమా అన్నారు.లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
లోకేశ్ పాదయాత్ర చేస్తారని ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధిస్తూ జీవో నెంబర్.1ను తీసుకువచ్చిందని విమర్శించారు.పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డీజీపీకి దరఖాస్తు చేసినా ఆమోదం తెలపలేదని మండిపడ్డారు.
లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తానంటే వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు.