సాయం కోసం ఆ వికలాంగ వృద్ధుడు ఏకంగా...?

వయో వృద్ధుడు లాక్ డౌన్ కారణంగా జీవనాధారం కోల్పోవడంతో తనకు సాయం అందించాలని ఏకంగా ఆ వృద్ధుడు 70 కిలోమీటర్ల దూరం సైకిల్ పై కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రాన్ని అందించాడు.

ఈ సంఘటన తమిళనాడులోని తంజావూర్ లో జరిగింది.

సదరు వ్యవసాయ కూలి పనులు లేని సమయంలో సైకిల్ పై తిరుగుతూ ముగ్గుపిండి అమ్ముకునే వ్యక్తి.ప్రస్తుతం లాక్ డౌన్ సమయం కారణంగా తాను అలా సైకిల్ పై ముగ్గుపిండి అమ్ముకోలేక పోవడంతో ప్రభుత్వ సాయం కోరేందుకు తంజావూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వడానికి ఆయన సైకిల్ పై ఏకంగా 70 కిలోమీటర్ల ప్రయాణించి చేరుకున్నాడు.

సైకిల్ పై రావడానికి గల కారణం ప్రస్తుతం రవాణా పరిస్థితి అంతగా లేకపోవడమే.సదరు వ్యక్తి పేరు నటేశన్.

ఆయన ఒక దివ్యాంగుడు.ఆయన ఉదయం తన గ్రామం నుండి తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరి 11 గంటలకు తంజావూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు.

Advertisement

ఆ తర్వాత అక్కడ ఉన్న అధికారులతో తనకు ప్రభుత్వ సహాయం అందించాలని ఆయన కోరడం జరిగింది.

అక్కడ అధికారులు పెద్ద మనిషిని వైద్యుడి ధృవపత్రం తీసుకురావాలని చెప్పడంతో ఆయన కాస్త అయోమయానికి గురయ్యాడు.అయితే ఈ విషయాన్ని గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ ఐ జోక్యం చేసుకొని అతనిని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి ఏర్పాట్లు చేశారు.ఈ నేపథ్యంలో నటేషన్ ను జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారి వద్దకు తీసుకు వెళ్ళగా, ఆయన సూచన మేరకు వైద్యుడుని ధ్రువపత్రం తీసుకుని అక్కడే ఉన్న తాసిల్దార్ కార్యాలయంలో దానిని అందజేస్తే సరిపోతుందని మీరు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు