ఆర్ఆర్ఆర్‌లో మరో బ్యూటీ.. ఏం చేస్తుందో?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమా రిలీజ్‌ను వచ్చే జనవరికి వాయిదా వేశారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో భారీ క్యా్స్టింగ్‌ ఉండటంతో ఈ సినిమాపై భారీ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు జక్కన్న.

ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవర్గన్ ఇటీవల ఈ సినిమాలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.ఆయనకు జోడీగా శ్రియా సరన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో అందాల భామ హంసా నందిని కూడా ఓ స్పెషల్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో కూడా హంసా నందిని నటించింది.

Advertisement

ఆర్ఆర్ఆర్‌లో అమ్మడిది ఎలాంటి పాత్ర అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.ఈ సినిమాలో ఆమెకు కేమియో పాత్ర ఇస్తారా లేక స్పెషల్ సాంగ్‌లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

ఇక హీరోయిన్లుగా ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు నటిస్తున్నారు.డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు