ఏపీ లో కూల్చివేతల పరంపర కొనసాగుతుంది.టీడీపీ పార్టీ భవనాలే టార్గెట్ గా వైసీపీ పార్టీ చర్యలు చేపట్టింది.
ఇటీవల కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదిక కూల్చివేయగా, మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా విశాఖ లో టీడీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.
ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి టీడీపీ కార్యాలయం కట్టారని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు నోటీసులు అందించినట్లు తెలుస్తుంది.ఒకవేళ నోటీసులకు నాలుగురోజుల్లో స్పందించకపోతే మాత్రం పార్టీ ఆఫీస్‌ను కూల్చివేస్తామన్నారు.
ఇప్పటికీ టీడీపీకి చెందిన పలువురు పెద్దలకు కూడా అధికారులు పలు భవనాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు అందించినట్లు తెలుస్తుంది.

ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి.టీడీపీ పార్టీ పై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ వైసీపీ మాత్రం అలాంటిది ఏమి లేదని చెప్పుకుంటూ టీడీపీ భవనాలనే టార్గెట్ చేస్తూ ప్రతి చర్య తీసుకుంటుంది.