ఎవరైనా ఆసుపత్రిలో రోగి ఉన్నాడంటే ఏదైనా టెస్ట్ లకు తీసుకెళ్లాలన్నా, మరేదైనా కానీ స్టేచర్ పై తీసుకువెళ్లడం జరుగుతుంది.ఎవరూ కూడా బెడ్ షీట్ పై రోగిని ఈడ్చుకు వెళ్లడం అనేది ఉండదు.
కానీ మధ్య ప్రదేశ్ జబల్ పూర్ లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆసుపత్రిలో మాత్రం దారుణ పరిస్థితి నెలకొంది.స్ట్రెచర్ ఫై తీసుకెళ్లాల్సిన రోగిని దారుణంగా బెడ్ షీట్ పై ఈడ్చు కెలుతున్న ఘటన వీడియో రూపంలో వెలుగులోకి వచ్చింది.
ఒక రోగిని ఎక్స్ రే రూమ్ కి తీసుకెళ్లడం కోసం అక్కడి సిబ్బంది బెడ్ షీట్ పై ఈడ్చు వెళుతున్నారు.దీనిని బట్టి ఆసుపత్రి లో సామాన్య రోగుల పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న విషయం మనకు అర్ధం అవుతుంది.
ఘోరంగా బెడ్ షీట్ పై రోగి ని ఈడ్చుకెతుండగా రోగి బంధువు కూడా రోగి తో పాటు వెనకాల వెళుతుంది.దీనికి సంబందించిన వీడియో ఒకటి వెలుగు లోకి రావడం తో ఈ విషయం తేటతెల్లమైంది.

మరి రోగి ని ఈ విధంగా బెడ్ షీట్ పై ఈడ్చుకు వెళ్లిన వీడియో బయటకు రావడం తో ఆ ఆసుపత్రి డీన్ స్పందించి వెంటనే ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విధంగా ఒక పేషెంట్ ను బెడ్ షీట్ పై తీసుకెళ్లడం పై అందరూ విమర్శలు చేయడం తో ఆ ఆసుపత్రి డీన్ డాక్టర్ నవనీత్ సక్సేనా ముగ్గురి పై యాక్షన్ తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు.అంతేకాకుండా ఈ ఘటన పై విచారణ కూడా జరపనున్నట్లు ఆయన తెలిపారు.