బిగ్ బాస్ లోకి గుప్పెడంత మనసు హీరో రిషి వసుధార... రచ్చ మామూలుగా ఉండదుగా?

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు ( Guppedantha Manasu ) సీరియల్ ఒకటి.

ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతు ఇప్పటికే సుమారు 1100 కు పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.

ఇక ఈ సీరియల్ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఈ సీరియల్ లో రిషిధార జంటకు విపరీతమైన క్రేజ్ ఉంది.

ఈ సీరియల్ నుంచి కొద్ది రోజులపాటు రిషి ( Rishi ) తప్పుకోవడంతో ఈ సీరియల్ రేటింగ్ పూర్తిగా పడిపోయింది.దీంతో తప్పనిసరి పరిస్థితులలో నిర్మాతలు తిరిగి రిషిను సీరియల్ లోకి తీసుకువచ్చారు.

ఇలా రిషి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా ఆ మాత్రం పెరిగిపోయింది.అయితే ఈ సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మేకర్స్ ఒక వారం వ్యవధిలోనే ఈ సీరియల్ కి ముగింపు పలకబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సీరియల్ మరొక వారం రోజులలో శుభం కార్డు పడబోతుంది అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

Advertisement

ఇంత అర్జెంటుగా ఈ సీరియల్ క్లోజ్ చేయడానికి కారణం బిగ్ బాస్( Bigg Boss ) అని తెలుస్తోంది.

బిగ్ బాస్ కార్యక్రమం త్వరలోనే ఇటు తెలుగులోనూ అటు కన్నడ భాషలో కూడా ప్రసారం కాబోతోంది తెలుగులో ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాక కన్నడలో 11వ సీజన్ ప్రారంభం కాబోతోంది.ఈ క్రమంలోనే ఈ సీరియల్ హీరో రిషి అలియాస్ ముఖేష్ గౌడ్ కన్నడ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం అదేవిధంగా వసుధార కూడా తెలుగు బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.నిజంగానే వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో కనుక పాల్గొంటే తప్పకుండా విజేతలుగా వీరే తిరిగి వస్తారని తెలుస్తుంది.

ఇక తెలుగులో రక్షగౌడ్ ( Raksha Gaud ) బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటే ఈమె విజేతగా నిలుస్తారు.తెలుగులో రక్షా గౌడ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది.

మరి వీరి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

నువ్వు మారవా అంటూ వేణుస్వామిపై ట్రోల్స్.. జాతకం నిజం కాకపోతే ఏం చేస్తావంటూ?
Advertisement

తాజా వార్తలు