టీడీపీ గూటికి చేరిన గుంటూరు జిల్లా వైసీపీ నేత‌

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ వైసీపీ నేత టీడీపీ గూటికి చేరారు.అధికార పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ గుదిబండ గోవ‌ర్ధ‌న్ రెడ్డి సైకిల్ ఎక్కారు.

 Guntur District Ycp Leader Who Joined The Tdp Fold-TeluguStop.com

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు … గోవ‌ర్ధ‌న్ రెడ్డి, ఆయ‌న అనుచరుల‌కు కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంత‌రం, వైసీపీ ప్ర‌భుత్వంపై గోవ‌ర్ధ‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం అయితే రాష్ట్రానికి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని ఆరోపించారు.స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యంతోనే టీడీపీలో చేరుతున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు.

ప‌దేళ్ల పాటు వైసీపీలో కొన‌సాగిన గోవ‌ర్ధ‌న్ రెడ్డి టీడీపీలో చేర‌డం జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube