ఈ నటుడు 300 సినిమాలు చేసినా అలాంటి గుర్తింపు మాత్రం రాలేదట.. ఏమైందంటే?

హాస్య నటుడిగా, రచయితగా గుండు సుదర్శన్ సినిమా రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.300కు పైగా సినిమాలలో గుండు సుదర్శన్ నటించగా ఈ సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే ఈ నటుడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఈ నటుడు నటనపై మక్కువతో సినిమాల్లోకి వచ్చాడు.

మిస్టర్ పెళ్లాం సినిమాతో గుండు సుదర్శన్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ఒక ఇంటర్వ్యూలో తాను ఏవీఎస్ ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టామని గుండు సుదర్శన్ తెలిపారు.

ఏవీఎస్ గారు అప్పటికే సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుండేవారని ఆయన జర్నలిస్ట్ కావడంతో ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో పరిచయం ఉందని ఆయన తెలిపారు.జర్నలిస్ట్ మిత్రులతో ఉన్న పరిచయం వల్ల ఆయనకు వాళ్లు కూడా సపోర్ట్ చేశారని ఆయనకు పీఆర్ కూడా బాగా ఉండేదని గుండు సుదర్శన్ అన్నారు.

నేను రచయితనైనా నా సీన్ల విషయంలో మార్పులు చెప్పనని ఆయన తెలిపారు.ఈ మధ్య కాలంలోనే తాను రచయితగా మారానని సుదర్శన్ చెప్పుకొచ్చారు.నాకు సంతృప్తిని ఇచ్చిన సినిమాలు తక్కువని ఆయన తెలిపారు.

Gundu Sudarshan Interesting Comments About His Cine Career Goes Viral Details, G
Advertisement
Gundu Sudarshan Interesting Comments About His Cine Career Goes Viral Details, G

15 సినిమాలు మాత్రమే సంతృప్తిని ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.కొన్ని సినిమాలలో తాను రెండు సీన్లకు మాత్రమే పరిమితమయ్యానని ఆయన తెలిపారు.ఒక జోడీలాగా నాకు సెటప్ కుదిరి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

మనం ఎంత ప్రొజెక్ట్ చేసినా కలిసి రావాలని ఆయన వెల్లడించారు.సీన్ల నిడివి పెంచాలని తాను ప్రతి సినిమాకు అడుగుతానని కొన్ని సినిమాలలో సినిమా అంతా ఉంటానని కానీ మనకు ఉపయోగపడేలా ఆ సినిమా ఉండదని తెలిపారు.

సినిమా రంగంలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయని తాను సంతృప్తికరంగా కెరీర్ ను కొనసాగిస్తున్నానని ఆయన వెల్లడించారు.గుండు సుదర్శన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు