గడపకు పసుపు కుంకుమ ఇలా పెడితే పట్టిందల్లా బంగారమే..!   Gummamiki Pasupu,Kumkuma Raste     2018-04-10   00:26:53  IST  Raghu V

మన హిందూ సాంప్రదాయంలో గడపకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గడప అంటే లక్ష్మిదేవితో సమానము. అందువల్ల లక్ష్మిదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్టు పెడతారు. గడపను తొక్కకుండా దాటి వెళ్ళాలి. అది ఇల్లు అయినా దేవాలయం అయినా గడపను దాటి మాత్రమే వెళ్ళాలి. ఇంటి గడపకు వారానికి ఒకసారైనా తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి.


అలాగే పర్వ దినాల్లో కూడా చేయాలి. ఇలా చేయటం వలన లక్ష్మి దేవి ఇంటిలో ఉండటమే కాకుండా దుష్ట శక్తులు అన్ని పోతాయి. ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నల్లని తాడుతో పటిక కడితే నర దిష్టి తొలగిపోతుంది. అన్ని రకాల దిష్టిలలో నర దిష్టి చాలా పవర్ ఫుల్. నర దిష్టికి రాళ్ళూ కూడా పగులుతాయనే సామెత కూడా ఉంది.

గడప ద్వార ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. చీలికలు లేకుండా అఖండంగా ఉండాలి. గడప దోషంగా ఉంటే హాని కలుగుతుంది. ఏ ఇంటికి అయినా గడపలు తప్పనిసరిపూర్వం నిర్మించిన ఇళ్లలో సింహద్వారానికి గడపలే కాకుండా ప్రతి గదికి గడపలు ఉండేవి. ఇక ఈ రోజుల్లో అయితే సింహద్వారం మరియు ఇంటి చుట్టూ ఉండే గుమ్మాలకు మాత్రమే గడపలు ఉంటున్నాయి. అన్ని గడపలకు పసుపు రాసి కుంకుమ పెట్టకపోయినా సింహద్వారానికి ఉన్న గడపకు రాసిన సరిపోతుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.